![raipur goat eye took the life of a villager - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/4/goat.jpg.webp?itok=8CZxOsdL)
మనిషికి చావు అనేది అత్యంత విచిత్ర పరిస్థితుల్లో సంభవిస్తుంటుంది. చావును ఎవరూ ముందుగా ఊహించలేరు. ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలోని ఖోపాధామ్‌లో ఒక వ్యక్తి మేకలను బలిచ్చాడు. తరువాత ఆ మేక మాంసంతో వంటకాలు చేయించి అందరికీ వడ్డించి, తానూ తిన్నాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే ఆ వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతని మృతికి కారణం ఏమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.
ఊహకందని విధంగా..
మేక కన్ను మనిషి ప్రాణాలను తీస్తుందని ఎవరైనా ఊహించగలరా? అయితే ఇది నిజంగానే జరిగింది. సూరజ్‌పూర్‌లో ఇటువంటి ఘటన చోటుచేసుకుంది. మేక కన్ను తిన్న వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి ఆలయంలో మేకలను బలి ఇచ్చిన తరువాత వాటి మాంసంతో వంటలు చేయించాడు. అతను ఆ వంటకాలలోని మేక కన్నును తిన్నాడు. అయితే అది అతని గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో అతనికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి, ప్రాణాలు వదిలాడు.
జిల్లా ఆసుపత్రికి తరలించగా..
ఈ ఘటన సూరజ్‌పూర్ జిల్లాలోని మదన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 50 ఏళ్ల బగార్ రాయ్ తన స్నేహితులతోపాటు ప్రముఖ ఖోపాథామ్‌కు వెళ్లాడు. తన కోరిక నెరవేరిన నేపధ్యంలో అతను అక్కడికి వెళ్లాడు. అక్కడ పూజలు నిర్వహించిన తరువాత మేకలను బలి ఇచ్చి, ఆ మాంసంతో వంటకాలు చేయించాడు. తరువాత వాటిని గ్రామస్తులకు వడ్డించాడు.
ఈ నేపధ్యంలో అతను మేక మాసంలోని దాని కన్నును తిన్నాడు. అయితే ఆ కన్ను అతని గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి అందక ఇబ్బంది పడ్డాడు. గ్రామస్తులు అతన్ని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియగానే వారు పరుగుపరుగున ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణం వారి రోదనలతో నిండిపోయింది.
ఇది కూడా చదవండి: ప్రియురాలి కోసం భార్య ముక్కు తెగ్గోసి, జేబులో వేసుకుని..
Comments
Please login to add a commentAdd a comment