సాక్షి, రాయ్‌పూర్: మావోయిస్టుల ఏరివేతపై కేంద్ర హోం శాఖ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే దండకారణ్యంలో ఆపరేషన్ ప్రహార్ పతాకస్థాయికి చేరింది. ఈ క్రమంలో బలగాల కూంబింగ్‌లో ఛత్తీస్‌గఢ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉలికిపాటు మొదలైంది.
వివరాల ప్రకారం.. మావోయిస్ట్ ఏరివేత కార్యక్రమాలను కేంద్ర హోంశాఖ తీవ్రతరం చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో ఆపరేషన్ ప్రహార్ కొనసాగుతోంది. నారాయణపూర్‌లో కేంద్ర బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. పీఎల్జీఏ స్థావరం అబూజ్మడ్‌ను చుట్టుముట్టేందుకు బీఎస్ఎఫ్, కోబ్రా, డీఆర్జీ, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్‌కు చెందిన పదివేల మందితో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
కాగా, ఇటీవలే జోసెఫ్ (దర్శన్ పాల్), సంజీత్ (అర్జున్ ప్రసాద్ సింగ్)ను పార్టీ వ్యతిరేక కార్యకలాపాల మూలంగా భారత్ కమ్యూనిస్ట్ మావోయిస్ట్ పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి సహకారంతో అబూజ్మడ్‌ను ముట్టడించే కార్యక్రమానికి కేంద్ర భద్రతా వర్గాలు రెడీ అయ్యాయి. ఇక, తాజాగా కూంబింగ్‌తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంథని తూర్పు డివిజన్ ఉలిక్కిపడింది. ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment