
సాక్షి, రాయ్‌పుర్ : ఇద్దరు యువ పాత్రికేయులు ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్‌లో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. ‘పత్రికా’ న్యూస్ పేపర్‌కు చెందిన రిపోర్టర్ కుమారి రేణు అవస్థి, ఐఎన్‌ఎస్ న్యూస్ చానెల్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న శైలేంద్ర వి సుఖర్మలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు వేర్వేరు సంఘటనలుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.