టీఎస్ సింగ్ దేవ్
న్యూఢిల్లీ: రామాయణంలో సీతాదేవి రాముడిని స్వయంవరం ద్వారా ఎంచుకున్నట్లుగానే, ఛత్తీస్‌గఢ్‌లో వచ్చే ఎన్నికల్లో తమ సీఎంను కూడా ఎంపిక చేసుకుంటామని ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత టీఎస్ సింగ్ దేవ్ అన్నారు. రాముడికి 14 ఏళ్ల వనవాసం తర్వాత మళ్లీ రాజ్యం దక్కిందనీ, తాము కూడా 15 ఏళ్లుగా ప్రతిపక్షంలోనే ఉన్నందున ఈసారి తమ పార్టీ విజయం ఖాయమంటూ ఆయన పోలిక చెప్పారు. బీజేపీని అధికారం నుంచి దింపేందుకు సారూప్య పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment