CM Selection
-
బీజేపీ సీఎంల ఎంపిక..మహారాష్ట్ర నేతల్లో ఆందోళన!
నాగ్‌పూర్ : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రాల్లో సీఎంలుగా కొత్త వారిని బీజేపీ హై కమాండ్ ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఎవరూ ఊహించని కొత్త ముఖాలను సీఎంలను చేసింది. ఇదే ప్రస్తుతం మహారాష్ట్ర బీజేపీ నేతలను కలవర పరుస్తోందని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది లోక్‌సభకు సాధారణ ఎన్నికలు పూర్తవగానే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధిస్తే సీఎం ఎవరన్న ప్రశ్న అక్కడి నేతల్లో ఉత్పన్నమవుతోంది. మూడు రాష్ట్రాల్లో పాపులర్ ముఖాలను పక్కనబెట్టి ఎవరికీ తెలియని కొత్త ముఖాలను హై కమాండ్ తెరమీదికి తీసుకురావడంపై మహారాష్ట్ర కాషాయ నేతల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాషష్ట్రంలో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల సైడ్‌లైన్స్‌లో బీజేపీ నేతలు ఇదే విషయమై జోరుగా చర్చిస్తున్నారట. బీజేపీ గెలిస్తే సీఎం ఎవరవుతారు? బీజేపీ మిత్రపక్షాలు కలిసి విజయం సాధిస్తే సీఎం ఎవరు? అనే అంశాలపై నేతలు తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదీచదవండి..ఐటీని పంపుతాననుకున్నావా..ప్రధాని సరదా వ్యాఖ్యలు -
యాదవ్‌కు సీఎం పదవి..బీజేపీ బిగ్ స్కెచ్!
భోపాల్:మధప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్‌యాదవ్ ఎంపిక వెనుక బీజేపీ పెద్ద రాజకీయ వ్యూహమే పన్నినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతోనే యాదవ్ వర్గానికి చెందిన నేతను సీఎం పదవికి ఎంపిక చేశారన్న ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు బీహార్‌లో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు సాధించాల్సి ఉంటుంది. ఈ రెండు స్టేట్లలో యాదవ జనాభా డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉంది. ఇది దృష్టిలో పెట్టుకునే యాదవ్ వర్గానికి చెందిన మోహన్ యాదవ్‌ను బీజేపీ మధ్యప్రదేశ్‌కు సీఎంను చేస్తోందని పొలిటికల్ పండిట్లు విశ్లేషిస్తున్నారు. అంతేగాక మోహన్ యాదవ్ భార్య ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు కావడంతో ఆయనను సీఎం చేస్తే ఆ ప్రభావం అక్కడ కచ్చితంగా ఉంటుందని బీజేపీ పెద్దలు నమ్ముతున్నారు. మోహన్ యాదవ్ మామయ్య యూపీలోని సుల్తాన్‌పూర్‌లో నివసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్,బీహార్లలో కలిపి మొత్తం 120 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. వీటిలో వీలైనన్ని ఎక్కువ సీట్లు తమ ఖాతాలో వేసుకుని ముచ్చటగా మూడోసారి కేంద్రంలో పవర్లోకి రావాలనేది కమలనాథుల టార్గెట్ అని స్పష్టమవుతోంది. మోహన్ యాదవ్ ఎంపికతో యాదవ్ ఓట్ల మీద ఆధారపడి రాజకీయం చేసే యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, బీహార్‌లో ఆర్జేడీని లోక్‌సభ ఎన్నికల్లో దెబ్బకొట్టేందుకు బీజేపీ పెద్ద స్కెచ్ వేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇప్పటికే 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)ని ఓడించి బీజేపీ రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదీచదవండి..జమ్ము కశ్మీర్‌కు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు: అమిత్ షా -
శివరాజ్ ‘రామ్ రామ్’ ట్వీట్: బీజేపీ కీలక ప్రకటన
భోపాల్ : మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ చేసిన ‘అందరికీ రామ్రామ్’ ట్వీట్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే ట్వీట్‌పై తాజాగా బీజేపీ స్పందించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్ నేతృత్వంలో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఒక పక్క కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ మొదలవనుండగా శివరాజ్ రామ్రామ్ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వి.డి శర్మ శివరాజ్ ట్వీట్‌పై తాజాగా వివరణ ఇచ్చారు. ఆ ట్వీట్‌కు పెద్ద ప్రత్యేకత ఏమీ లేదన్నారు. ఇది రామజన్మభూమి అని, జనవరిలో అయోధ్యలో రామ మందిరం ప్రారంభమవనున్నందున శుభాకాంక్షలు చెప్పేందుకు శివరాజ్ అలా ట్వీట్ చేసి ఉంటారని తెలిపారు. మధ్యప్రదేశ్ కొత్త సీఎం ఎంపిక కోసం హరియాణా సీఎం మనోహర్ లాల్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ బీజేపీ అధ్యక్షుడు డీవీ శర్మ తదితర ముఖ్య నేతలతో హైకమాండ్ ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సోమవారం భోపాల్‌లో కొత్త సీఎం ఎంపికపై కసరత్తు ప్రారంభించనుంది. పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్న కమిటీ సీఎం ఎవరన్నదానిపై ఓ నిర్ణయం తీసుకోనుంది. మధ్యప్రదేశ్ సీఎం రేసులో ప్రధానంగా శివరాజ్ సింగ్‌తోపాటు జ్యోతిరాదిత్య సింథియా, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఉన్నారు. सभी को राम-राम... pic.twitter.com/QpaOxpZyMk — Office of Shivraj (@OfficeofSSC) December 9, 2023 ఇదీచదవండి..జర్నలిస్టు సౌమ్య హత్య కేసు: 15 ఏళ్లు పోరాడిన తండ్రి మృతి -
బీజేపీ సీఎంల ఎంపికపై గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు
జైపూర్:రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారం తర్వాత కూడా ముఖ్యమంత్రిని నిర్ణయించుకోలేకపోతున్నారని రాజస్థాన్ కేర్‌టేకర్ సీఎం అశోక్ గెహ్లాట్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై సమీక్ష సందర్భంగా గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ గెలిచి సీఎంను డిసైడ్ చేయడంలో ఇంత ఆలస్యం చేసి ఉంటే బీజేపీ నేతలు తమపై అరుపులు, కేకలు పెట్టేవాళ్లని గెహ్లాట్ ఎద్దేవా చేశారు. కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గొగామెడి కేసులో విచారణ జరిపేందుకుగాను ఎన్ఐకు ఎన్ఓసీ ఇచ్చే ఫైల్‌పై తాను సంతకం చేయలేదని చెప్పారు. ‘ఎన్నికల్లో గెలిచి వారం దాటినా ఇప్పటికీ కొత్త ముఖ్యమంత్రి రాలేదు. కొత్త సీఎం ఎన్ఐఏ ఫైల్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. త్వరగా సీఎం ఎంపికపై నిర్ణయం తీసుకోండి’అని గెహ్లాట్ కోరారు. ‘బీజేపీలో క్రమశిక్షణ లేదు. వారం రోజులు గడుస్తున్నా మూడు రాష్ట్రాల్లో ఇంత వరకు సీఎంను ఎంపిక చేయలేదు. ఇదే పని మేం చేసి ఉంటే ఎన్ని మాపై వారు ఎన్ని విమర్శలు చేసి ఉండే వాళ్లో తెలియదు. ఎన్నికల్లో వారు ఓట్లు పోలరైజ్ చేసి గెలిచారు. అయినా కొత్త ప్రభుత్వానికి మా సహకారం ఉంటుంది’ అని గెహ్లాట్ తెలిపారు. #WATCH | Congress leader and Rajasthan caretaker CM Ashok Gehlot arrives in Delhi to take part in a meeting to review the party's performance in recently held assembly polls in the state "...For around seven days now, they (BJP) have not been able to announce CM faces in the… pic.twitter.com/BIv6B8kd0J — ANI (@ANI) December 9, 2023 ఇదీచదవండి..అమెరికన్ కన్సల్టెన్సీ సర్వే: ప్రధాని మోదీపై కీలక విషయం వెల్లడి..! -
బీజేపీ సీఎంలను ఎంపిక చేసేది వీరే
న్యూఢిల్లీ: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిన మూడు రాష్ట్రాల్లో సీఎంల ఎంపికకు బీజేపీ హై కమాండ్ కసరత్తు ప్రారంభించింది. సీఎంల ఎంపిక కోసం ప్రత్యేకంగా పరిశీలకులను నియమించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ల కొత్త సీఎంల ఎంపిక కోసం పరిశీలకులను ఆయా రాష్ట్రాలకు పంపనుంది. రాజస్థాన్‌కు పరిశీలకులుగా వెళ్లనున్న వారిలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ముండా ఛత్తీస్‌గఢ్‌కు పరిశీలకులుగా వెళ్లనున్నారు. వీరితో కలిపి మూడు రాష్ట్రాలకు మొత్తం 9 మంది పరిశీలకులను బీజేపీ అధినాయకత్వం పంపనుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూడు రాష్ట్రాల్లో గతంలో సీఎంలుగా పనిచేసిన వారిని కాకుండా కొత్త ముఖాలను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసే ఆలోచనలో పార్టీ హై కమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే అక్కడ సీఎంల ఎంపిక ఇంత ఆలస్యమవుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇదీచదవండి.. సహజీవనం ప్రమాదకరమైన జబ్బు -
తెలంగాణ సీఎం సీటుపై వీడని ఉత్కంఠ..రాజ్ భవన్ లో ఆగిపోయిన సీఎం ప్రమాణ స్వీకారం
-
కర్ణాటక సీఎం పంచాయితీ...ఎందుకిలా..? ఢిల్లీకి వెళ్లడంతోనే ఈ చిక్కులు
ఎస్.రాజమహేంద్రారెడ్డి: ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల్లో గెలవడమే అతిపెద్ద సవాల్. ది గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు మాత్రం ఎన్నికల్లో నెగ్గడం దైవాదీనం, నెగ్గాక ముఖ్యమంత్రిని ఎంపిక చేయడమే అతిపెద్ద సవాల్. ప్రస్తుత కర్ణాటక సంక్షోభమే ఇందుకు ఉదాహరణ. ఐదేళ్లు పాలించిన బీజేపీని కాదని, కింగ్‌మేకర్ అనుకున్న జేడీ(ఎస్)కు అవకాశం లేకుండా చేసి, కర్ణాటక ఓటర్లు అందించిన ఘన విజయాన్ని సగర్వంగా భుజాలకెత్తుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎంపికలో తడబాటుకు గురవుతోంది. ఎన్నో చేదు అనుభవాలు, మరెన్నో గుణపాఠాల నుంచి నేర్చుకున్నది ఏమీ లేదని ఆ పార్టీ మరోసారి రుజువు చేసింది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం నుంచి శాసనసభాపక్ష నాయకుడు సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్లను ‘దోస్త్ మేరా దోస్త్’ దాకా తీసుకొచ్చి ఎన్నికల ముందు హిట్ కొట్టిన కాంగ్రెస్ హైకమాండ్, సీఎం పదవి విషయానికొచ్చేసరికి ఇద్దరి మధ్య సఖ్యత కుదర్చడానికి మల్లగుల్లాలు పడుతోంది. ఎందుకిలా? ఒకేమాట.. కలలో మాట ఎన్నికల ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాటే గాందీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ల మాటగా చెల్లింది. దాంతో ఎందుకిలా అని అడిగేవాళ్లు గానీ, అలకపాన్పు ఎక్కే వాళ్లు గానీ ఎవరూ కనిపించలేదు. లేదా ఎవరూ అందుకు సాహసించలేదు. సిద్ధరామయ్య, శివకుమార్‌లు సైతం ఖర్గే మాట జవదాటకుండా పార్టీ విజయానికి కృషి చేశారు. గెలిచాక మళ్లీ షరా మామూలే! సిద్ధరామయ్య, శివకుమార్‌లు ఎవరి గూట్లోకి వారు వెళ్లిపోయి, సై అంటే సై అనే స్థాయిలో ఢీకొంటున్నారు. సీఎం రేసులోనూ అదే వైఖరి. ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులైనా ఎటూ తేల్చుకోలేని స్థితిలో అధిష్టానం ఊగిసలాడుతోందంటే ఏమనుకోవాలి? పార్టీలోని పెద్దలు ఒకేమాట మీద నిలబడలేకపోవడం కారణం కాదా? రాహుల్ గాందీ, ప్రియాంకా గాందీలు సిద్ధరామయ్య వైపు, మల్లికార్జున ఖర్గే శివకుమార్ వైపు మొగ్గు చూపుతున్నారని అభిజ్ఞ వర్గాల భోగట్టా. ఎన్నికల ముందు లాగా హైకమాండ్ ఒకేమాట మీద ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. సిద్ధరామయ్య, శివకుమార్‌లు మా అంటే కాసేపు అలకపాన్పు ఎక్కి, ఆ తర్వాత సర్దుకునేవారు. అందుకే సీఎం పీఠంపై పీటముడి గతంలో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్య అనుభవానికి పెద్దపీట వేయడంలో తప్పులేదు గానీ, పార్టీ విజయం కోసం అహర్నిశలూ చెమటోడ్చడమే కాకుండా ఆర్థిక వనరులు సైతం సమకూర్చిన శివకుమార్‌ను ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోమనడం అభిమానులకు రుచించలేదు. అందుకే ముఖ్యమంత్రి పీఠంపై పీటముడి పడింది. ఢిల్లీ వేదికగా ప్రత్యర్థులిద్దరూ బుధవారం మొత్తం లాబీయింగ్‌లో తలమునకలై ఉన్నారు. క్షణానికో సీన్ మారింది. సిద్ధరామయ్యే సీఎం అంటూ లేఖ సైతం సిద్ధమయ్యింది. శివకుమార్ ససేమిరా అనడంతో ఆ లేఖ బుట్టదాఖలయ్యింది. బెంగళూరు కంఠీరవ స్టేడియంలో గురువారం జరగాల్సిన ప్రమాణ స్వీకార ఏర్పాట్లను ప్రస్తుతానికి నిలిపేశారు. సీఎం పోస్టు కోసం కోట్లాట ఈ స్థాయికి చేరుకుందంటే ముగింపు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అసలు హైకమాండ్ దాకా వెళ్లకుండా కాంగ్రెస్ శాసనసభాపక్ష(సీఎల్పి) సమావేశంలోనే సీఎం అభ్యర్థిని ఎన్నుకొని ఉంటే ఎలాంటి వివాదానికి తావు ఉండేది కాదు. హైకమాండ్ చేతికి మట్టి అంటకుండా ఉండేది. అలా చేస్తే అది కాంగ్రెస్ సంస్కృతి ఎందుకవుతుంది? తెగేదాకా లాగి రెండు కుంపట్లు పెట్టుకుంటే ప్రతిపక్షం దాన్ని సొమ్ము చేసుకోవడం ఖాయం. అదే పరిస్థితి వస్తే ఈ ఇద్దరినీ కాదని మూడో వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం తప్ప కాంగ్రెస్‌కు మరో గత్యంతరం లేదు. కాంగ్రెస్ నేర్చుకున్నదేమీ లేదు రాజస్తాన్‌లో 2018లో అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య మొదలైన సీఎం పీఠం లొల్లి ఐదేళ్లయినా ఇంకా ఓ కొలిక్కిరాలేదు. ఈ అనుభవం నుంచి కాంగ్రెస్ నేర్చుకున్నదేమీ లేదు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని గెలిపించిన సచిన్ పైలట్‌ను పక్కనపెట్టి (కొన్ని రోజులు డిప్యూటీ సీఎం పదవి ఎరవేసి), అనుభవాన్ని సాకుగా చూపి గహ్లోత్‌ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. అప్పటినుంచి రాజస్తాన్ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతూనే ఉంది. రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో గెలుస్తామన్న ఆశలు సన్నగిల్లాయి. ఇదంతా ఎందుకంటే.. డీకే శివకుమార్ మరో సచిన్ పైలట్ అయితే, కర్ణాటక మరో రాజస్తాన్ అవుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. -
Karnataka: కొనసాగుతున్న కర్నాటకం.. పట్టు వీడని సిద్ధూ, డీకే
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానానికి చుక్కలు చూపుతోంది. మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఎవరి పట్టు మీద వారే ఉండటంతో పీటముడి మరింత బిగుసుకుంటోంది. ఈ విషయమై హస్తినలో సోమ, మంగళవారాల్లో అధిష్టానం చర్చోపచర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. దాంతో బుధవారం నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడం తెలిసిందే. కానీ ఇద్దరు నేతల్లో ఎవరూ వెనక్కు తగ్గేందుకు సిద్ధంగా లేకపోవడంతో చివరికి అధిష్టానం ఏమీ తేల్చలేకపోయింది. నిర్ణయానికి మరో రెండు మూడు రోజులు పట్టవచ్చని కాంగ్రెస్ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జి రణ్‌దీప్ సుర్జేవాలా మీడియాకు చెప్పారు. ఆలోపు కాంగ్రెస్ నేతలెవరూ దీనిపై తప్పుడు ప్రకటనలు చేయొద్దని ఆదేశించారు. లేదంటే క్రమశిక్షరాహిత్యంగా పరిగణించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేని బీజేపీ సీఎం ఎంపికపై తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సీఎంను కూడా ఎన్నుకోలేకపోతున్నారన్న విమర్శలను తిప్పికొట్టారు. అస్సాం వంటి రాష్ట్రాల్లో సీఎం ఎంపికకు బీజేపీ ఎన్ని రోజులు తీసుకుందో అందరికీ తెలుసన్నారు. ఎవరిని సీఎం చేయాలో కూడా తేల్చుకోలేని అయోమయంలో కాంగ్రెస్ పెద్దలున్నారంటూ కర్ణాటక తాజా మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, ఇతర బీజేపీ నేతలు అంతకుముందు చురకలు వేశారు. రోజంతా చర్చలే చర్చలు బుధవారం ఉదయం రాహుల్‌గాంధీ తొలుత సిద్ధరామయ్య, తర్వాత డీకేతో సమావేశమయ్యారు. 10, జన్‌పథ్ నివాసంలో వారితో చెరో అరగంటకు పైగా చర్చలు జరిపారు. తర్వాత సిద్ధరామయ్యనే సీఎం చేయాలని అధిష్టానం నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఈ మేరకు లేఖ కూడా సిద్ధమైనట్టు సమాచారం. బెంగళూరు కంఠీరవ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం సిద్ధరామయ్య ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. సిద్ధరామయ్యే సీఎం అంటూ చానళ్లలో వార్తలు రావడంతో ఆయన సొంతూళ్లో, బెంగళూరులోని నివాసం వద్ద సంబరాలు మొదలయ్యాయి. దాంతో భగ్గుమన్న డీకే సరాసరి వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. అనంతరం బెంగళూరులో ప్రమాణోత్సవ ఏర్పాట్లు నిలిచిపోయాయి. నిర్ణయానికి మరో రెండు మూడు రోజులు పట్టొచ్చన్న ప్రకటన వెలువడింది. తర్వాత ప్రతిష్టంభనకు తెర దించే ప్రయత్నాలను అధిష్టానం ముమ్మరం చేసింది. వాటిలో భాగంగా ఆదివారం నాటి కర్ణాటక సీఎల్పీ భేటీకి అధిష్టానం పరిశీలకునిగా వెళ్లిన సుశీల్‌కుమార్ షిండేతో ఖర్గే తన నివాసంలో భేటీ అయ్యారు. బుధవారం హస్తినలో చోటుచేసుకున్న కర్ణాటక రాజకీయ పరిణామాలు... ♦ ఉదయం 8.46: సీఎం రేసులో ముందున్న సిద్ధరామయ్య ♦ 11.30: సిద్ధరామయ్యతోరాహుల్ భేటీ ♦ మధ్యాహ్నం 12.20: డీకే శివకుమార్‌తో రాహుల్ సమావేశం ♦ 1.27: బెంగళూరు కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకార ఏర్పాట్లు షురూ ♦1.54: సిద్ధరామయ్యను సీఎంగా పేర్కొంటూ లేఖ ప్రతి కూడా సిద్ధం ♦ 2.14: కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో శివకుమార్ భేటీ ♦ 4.16: షేరింగ్ ఫార్ములాకు, డిప్యూటీ సీఎం పదవికి డీకే ససేమిరా ♦ సాయంత్రం 4.30: బెంగళూరులో నిలిచిపోయిన ప్రమాణస్వీకార ఏర్పాట్లు ♦ 5.25: ఎమ్మెల్యేలు, మద్దతుదారులతో ఢిల్లీలోని సోదరుడు సురేశ్ నివాసంలో డీకే మంతనాలు -
‘స్వయంవరం ద్వారా సీఎం ఎంపిక’
న్యూఢిల్లీ: రామాయణంలో సీతాదేవి రాముడిని స్వయంవరం ద్వారా ఎంచుకున్నట్లుగానే, ఛత్తీస్‌గఢ్‌లో వచ్చే ఎన్నికల్లో తమ సీఎంను కూడా ఎంపిక చేసుకుంటామని ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత టీఎస్ సింగ్ దేవ్ అన్నారు. రాముడికి 14 ఏళ్ల వనవాసం తర్వాత మళ్లీ రాజ్యం దక్కిందనీ, తాము కూడా 15 ఏళ్లుగా ప్రతిపక్షంలోనే ఉన్నందున ఈసారి తమ పార్టీ విజయం ఖాయమంటూ ఆయన పోలిక చెప్పారు. బీజేపీని అధికారం నుంచి దింపేందుకు సారూప్య పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని పేర్కొన్నారు. -
రహస్య బ్యాలెట్
సీఎం ఎన్నికకు బీజేపీ ప్రతిపాదన న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు విషయమై బీజేపీ సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. రహస్య బ్యాలెట్ విధానం ద్వారా ముఖ్యమంత్రిని ఎన్నుకునేలా చర్యలు తీసుకోవాలని ఎల్జీని కోరాలని భావిస్తోంది. జాతీయ ప్రాదేశిక ప్రాంత చట్టం, 1991లో అందుకు అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. చట్టంలోని సెక్షన్ 9(2) ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో రహస్య ఓటింగ్ నిర్వహించాలి. అందులో ఎక్కువమంది అభ్యర్థులు బలపర్చిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించవచ్చు. ఇప్పటిదాకా బిల్లును ఆమోదించే విషయంలోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు కూడా ఈవిధానాన్ని అనుసరించవచ్చు. ముఖ్యమంత్రిని ఎన్నుకున్న తర్వాత సభలో అత్యధిక మెజార్టీ ఉన్న పార్టీ అధికారపక్షం, ఆ తర్వాత ఎక్కువ మంది సభ్యులున్న పార్టీ ప్రతిపక్షం అవుతుంది. అయితే ఈ చట్టం ప్రకారం పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేసే అవకాశం ఉండదు. అంతేకాక ఏ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఎవరిని బలపర్చారో కూడా తెలిసే అవకాశం లేదు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు సమస్యను పరిష్కరించాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్ డిమాండ్ చేస్తున్నారు. అలాకాకుండా అసెంబ్లీలో మెజార్టీ సభ్యులున్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినా తమకేమీ అభ్యంతరం లేదని సతీశ్ స్పష్టం చేశారు. అయితే తమ పార్టీ ఎన్నికలకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉందని, ఈ మూడు ప్రతిపాదనల్లో తాము దేనినైనా అంగీకరిస్తామని ఉపాధ్యాయ్ తెలిపారు. కాగా బీజేపీ చేసిన ఈ డిమాండ్‌పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రహస్య ఓటింగ్ నిర్వహించడమంటే బేరసారాలకు బహిరంగంగా తలుపులు తెరిచినట్లేనని పేర్కొంటున్నారు.