భోపాల్ : మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ చేసిన ‘అందరికీ రామ్‌రామ్’ ట్వీట్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే ట్వీట్‌పై తాజాగా బీజేపీ స్పందించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్ నేతృత్వంలో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఒక పక్క కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ మొదలవనుండగా శివరాజ్ రామ్‌రామ్ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వి.డి శర్మ శివరాజ్ ట్వీట్‌పై తాజాగా వివరణ ఇచ్చారు. ఆ ట్వీట్‌కు పెద్ద ప్రత్యేకత ఏమీ లేదన్నారు. ఇది రామజన్మభూమి అని, జనవరిలో అయోధ్యలో రామ మందిరం ప్రారంభమవనున్నందున శుభాకాంక్షలు చెప్పేందుకు శివరాజ్ అలా ట్వీట్ చేసి ఉంటారని తెలిపారు.
మధ్యప్రదేశ్ కొత్త సీఎం ఎంపిక కోసం హరియాణా సీఎం మనోహర్ లాల్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ బీజేపీ అధ్యక్షుడు డీవీ శర్మ తదితర ముఖ్య నేతలతో హైకమాండ్ ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సోమవారం భోపాల్‌లో కొత్త సీఎం ఎంపికపై కసరత్తు ప్రారంభించనుంది.
పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్న కమిటీ సీఎం ఎవరన్నదానిపై ఓ నిర్ణయం తీసుకోనుంది. మధ్యప్రదేశ్ సీఎం రేసులో ప్రధానంగా శివరాజ్ సింగ్‌తోపాటు జ్యోతిరాదిత్య సింథియా, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఉన్నారు.
सभी को राम-राम... pic.twitter.com/QpaOxpZyMk
— Office of Shivraj (@OfficeofSSC) December 9, 2023
ఇదీచదవండి..జర్నలిస్టు సౌమ్య హత్య కేసు: 15 ఏళ్లు పోరాడిన తండ్రి మృతి
Comments
Please login to add a commentAdd a comment