
నాగ్‌పూర్ : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రాల్లో సీఎంలుగా కొత్త వారిని బీజేపీ హై కమాండ్ ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఎవరూ ఊహించని కొత్త ముఖాలను సీఎంలను చేసింది. ఇదే ప్రస్తుతం మహారాష్ట్ర బీజేపీ నేతలను కలవర పరుస్తోందని ప్రచారం జరుగుతోంది.
వచ్చే ఏడాది లోక్‌సభకు సాధారణ ఎన్నికలు పూర్తవగానే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధిస్తే సీఎం ఎవరన్న ప్రశ్న అక్కడి నేతల్లో ఉత్పన్నమవుతోంది. మూడు రాష్ట్రాల్లో పాపులర్ ముఖాలను పక్కనబెట్టి ఎవరికీ తెలియని కొత్త ముఖాలను హై కమాండ్ తెరమీదికి తీసుకురావడంపై మహారాష్ట్ర కాషాయ నేతల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాషష్ట్రంలో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల సైడ్‌లైన్స్‌లో బీజేపీ నేతలు ఇదే విషయమై జోరుగా చర్చిస్తున్నారట. బీజేపీ గెలిస్తే సీఎం ఎవరవుతారు? బీజేపీ మిత్రపక్షాలు కలిసి విజయం సాధిస్తే సీఎం ఎవరు? అనే అంశాలపై నేతలు తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment