ఎన్నికల్లో రాజకీయపార్టీలపై అభిమానం పెంచుకున్న కార్యకర్తలు ఏదో రూపంలో అభిమానాన్ని చాటుకోవడం చూస్తునే ఉంటాం

ఎన్నికల్లో రాజకీయపార్టీలపై అభిమానం పెంచుకున్న కార్యకర్తలు ఏదో రూపంలో అభిమానాన్ని చాటుకోవడం చూస్తునే ఉంటాం. జోధ్ పూర్ లోని ఓ బీజేపీ అభిమాని తనదైన శైలిలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీపై అభిమానాన్ని చాటుకున్నాడు.
పుచ్చకాయల వ్యాపారి ఈసారి మోడీ ప్రభుత్వమే 'అబ్ కి బార్ మోడీ సర్కార్' అనే విధంగా పుచ్చకాయలతో రాసి మోడీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆకాంక్షించాడు.
అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిన యూపీఏ ప్రభుత్వం నుంచి అధికారాన్ని దక్కించుకునేందుకు మోడీ నేతృత్వంలోని బీజేపీ, ఎన్ డీఏ కూటమి తీవ్రం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో సగటు అభిమాని ఆశలు తీరుతుందా అనే ప్రశ్నకు కొద్ది రోజులాగాల్సిందే.