జైపూర్: రాజస్తాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను అత్యంత పాశవికంగా హతమార్చిందో భార్య. అనంతరం అతడి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మురుగునీటి శుద్ధి కర్మాగారంలో పడేసింది. జోధ్‌పూర్‌లో జరిగిన ఈ సంచలన హత్యకు సంబంధించిన మిస్టరీని 48 గంటల్లోనే ఛేదించినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాలు... నందాడి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సమీపంలోని మురికి కాలువలో రెండు బాక్సులను బుధవారం స్థానికులు గుర్తించారు. వాటిని పరీక్షించి చూడగా అందులో మనిషి మాంసం కనిపించడంతో బెంబేలెత్తిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. (బాలిక కళ్లెదుటే ఆమె తల్లిని కడతేర్చాడు)
ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు.. స్థానికంగా నివసించే సుశీల్ అలియాస్ చరణ్ సింగ్ మిస్సయినట్లు గుర్తించారు. అతడి గురించి సేకరించిన వివరాల ఆధారంగా లోతుగా దర్యాప్తు జరపగా తానే భర్తను చంపినట్లు సుశీల్ భార్య పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది. తన అక్కాచెల్లెళ్లు, ఫ్రెండ్ సాయంతో సుశీల్‌ను తమ ఇంట్లోనే అంతమొందించానని, అనంతరం శవాన్ని ముక్కలుగా నరికి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో పడవేసినట్లు తెలిపింది.(కొడుకును దారుణంగా హతమార్చిన తండ్రి)
ఈ ఘటనలో నిందితురాలితో పాటు ఆమెకు సహకరించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. భార్యభర్తల మధ్య గొడవల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు భావిస్తున్నామని, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. ఘటనాస్థలిలో లభించిన మృతుడి బైక్, ప్రత్యక్ష సాక్షుల ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా స్వల్పకాలంలోనే కేసును ఛేదించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment