సాక్షి, జోధ్‌పూర్ : ట్రిపుల్ తలాక్‌పై సుప్రీం కోర్టు తాత్కాలిక నిషేధం విధించిన తరువాత.. కూడా ఒక ముస్లిం మహిళకు తలాక్ చెప్పి.. మరో పెళ్లి చేసుకున్న ఘటన జోధ్‌పూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నివాసముంటున్న అఫ్సానాకు భర్త మున్నా.. సెప్టెంబర్ 18న ఫోన్‌లో ముమ్మారు తలాక్ చెప్పి పెట్టేశాడు. తలాక్ చెప్పి రెండు రోజుల గడవకముందే మున్నా మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని బాధితురాలు అఫ్సానా చెబుతున్నారు.
మున్నాతో.. తనకు ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగిందని.. అప్పటినుంచీ అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు హింసించేవారని అఫ్సానా చెప్పారు. కట్నం తేలేదని.. 2015లో ఒకసారి ఒంటిమీద కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారని ఆమె తెలిపారు. ట్రిపుల్ తలాక్‌పై తాత్కాలిక నిషేధం ఉందని.. ఇప్పుడు ఇది చెల్లదు కాబట్టి.. భర్త కుటుంబం మీద కేసు పెడతానని ఆమె చెప్పారు. ఇద్దరు పిల్లల పోషణకు భరణం కోసం కోర్టును ఆశ్రయిస్తానని అఫ్సానా తెలిపారు.