
జోధ్‌పూర్ (రాజస్థాన్): జోధ్‌పూర్‌కు చెందిన మోడల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకోవాలనుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గున్‌గున్ ఉపాధ్యాయ్ జోధ్‌పూర్‌కు చెందిన ఫ్యాషన్ మోడల్. ఏదో పని మీద ఉదయ్‌పూర్ వెళ్లిన శనివారం జోధ్‌పూర్‌కు తిరిగొచ్చింది. ఈ క్రమంలో రతనాద ప్రాంతంలోని లార్ట్స్ ఇన్ హోటల్‌లో బస చేసిన ఆమె ఆరో అంతస్తు నుంచి కింది దూకి ఆత్మహత్యకు యత్నించింది.
దీనికన్నా ముందు ఆమె తన తండ్రితో ఆఖరుసారి మాట్లాడాలనుకుందట. అందుకని వెంటనే తండ్రికి ఫోన్ చేసి చనిపోతున్నాను నాన్నా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. దీంతో వెంటనే ఆందోళన చెందిన ఆమె తండ్రి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఆమెను ఆపాలని చెప్పాడు. కానీ పోలీసులు అక్కడికి చేరుకునేలోపే గున్‌గున్ బిల్డింగ్‌పై నుంచి దూకేసిది. ఆమెను ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మోడల్ కాళ్లు, ఛాతీ భాగం ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment