Bollywood Actor Milind Soman Marriage With 25 Years Old Women Ankita Konwar - Sakshi
Sakshi News home page

Milind Soman: చాలామంది మోడల్స్‌తో డేటింగ్‌.. చివరికీ 26 ఏళ్ల అమ్మాయితో పెళ్లి!

Published Wed, Jul 19 2023 1:09 PM | Last Updated on Wed, Jul 19 2023 1:23 PM

Bollywood Actor Milind Soman Married 25 Years Old Women - Sakshi

సాధారణంగా పెళ్లి చేసుకునేటప్పుడు వయసు తేడాను కొందరు పరిగణనలోకి తీసుకుంటారు. సెలబ్రీటీల విషయంలో వీటిపై మరింత ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎవరైనా పెళ్లి విషయంలో కాస్తా అటు ఇటుగా 5 నుంచి పదేళ్ల వయస్సు తేడాలను చూసి ఉంటాం. కానీ ఏకంగా తన వయసులో సగం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అరుదుగా కనిపించే దృశ్యం. కానీ పెళ్లికి వయసుతో పనిలేదంటూ..  నిజ జీవితంలోనూ ఇలాంటి పెళ్లి చేసుకోవచ్చని నిరూపించాడు బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్. 

(ఇది చదవండి: ‘బ్ల‌డ్ అండ్ చాక్లెట్’లో ప్రేమ, అభిమానం రెండూ ఉంటాయి)

ప్రముఖ మోడల్, నటుడైన మిలింద్ సోమన్ జీవితం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.  అతను ఇప్పటికే చాలా పెళ్లిళ్లు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు జరిగిన వివాహాం అన్నింటికంటే ప్రత్యేకతను సంతరించుకుంది. 2018లో అంకితా కున్వర్‌తో జరిగిన వివాహం గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. అంకితను పెళ్లి చేసుకునే సమయానికి మిలింద్‌ వయసు 52 ఏళ్లు కాగా.. ఆమె వయసు కేవలం 26 సంవత్సరాలే. తన వయసులో సగం మాత్రమే అంకితను పెళ్లాడిన నటుడిగా సోమన్ నిలిచాడు. 

అంతకుముందే చాలామందితో డేటింగ్..

అంకితతో పెళ్లికి ముందు మిలింద్ మొదట ఫ్రెంచ్ నటి మైలీన్ జంపానోయిని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో అతని కంటే మైలీన్ 15 సంవత్సరాలు చిన్నది. కాగా.. మిలింద్, మైలీన్‌ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చిత్రం సెట్‌లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన రెండేళ్లకే మనస్పర్థలు రావడంతో 2009లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

ఆ తరువాత మిలింద్ సోమన్ చాలామంది నటీమణులతో డేటింగ్ కొనసాగించారు.  మోడల్ మధు సప్రే, నటి షహానా గోస్వామి, దీపానిత శర్మ, గుల్ పనాగ్ వంటి నటీమణులతో అతనితో రిలేషన్‌లో ఉన్నారు. కానీ చివరికీ వయసులో తనకంటే సగం చిన్నదైన అంకిత కున్వర్‌ను  వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా.. దాదాపుగా పెళ్లయిన ఐదేళ్ల తర్వాత కూడా వీరి బంధం బలపడుతోంది. ఇటీవల ఇద్దరు తరచుగా ట్రావెలింగ్, ఫిట్‌నెస్ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ సందడి చేస్తున్నారు. 

(ఇది చదవండి: సీన్‌ రివర్స్‌.. ధనుష్‌ డైరెక్షన్‌లో నటించనున్న సెల్వ రాఘవన్‌!)

క్యాబిన్ క్రూగా పనిచేసిన అంకిత

 మిలింద్‌ని పెళ్లి చేసుకునే ముందు అంకిత క్యాబిన్ క్రూ మెంబర్‌గా పనిచేసింది. పెళ్లికి కొద్ది రోజుల ముందే ఆ ఉద్యోగాన్ని వదిలేసింది. అంకిత తరచుగా నన్ను పాపాజీ అని పిలుస్తుందని మిలింద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంకితను పెళ్లి చేసుకోవాలనే కోరికను బయటపెట్టినప్పుడు.. అతని తల్లి షాక్ అయ్యిందని తెలిపారు. ఇది విని అంకిత కుటుంబ సభ్యులు సైతం షాక్ తిన్నారని నటుడు వివరించాడు. కాగా.. మిలింద్ హిందీ కామెడీ షో ఖత్రోన్ కే కిలాడీ సీజన్‌-3లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement