నలుగురితో ప్రేమాయణం.. అదే చెత్త రిలేషన్‌ అంటున్న బ్యూటీ | Baseer and my relationship was toxic and abusive: Nikita Bhamidipati | Sakshi
Sakshi News home page

'నా మాజీ ప్రియుడు అసభ్యంగా దూషించేవాడు.. ఛీ, తనతో ఎలా ఉన్నానో!'

Published Sat, Dec 23 2023 11:33 AM | Last Updated on Sat, Dec 23 2023 12:18 PM

Baseer and my relationship was toxic and abusive: Nikita Bhamidipati - Sakshi

లవ్‌ చేయాలా? వద్దా? అని యూత్‌ ఎక్కువగా ఆలోచించడం లేదు. నచ్చితే కంటిన్యూ అవుదాం.. లేదంటే బ్రేకప్‌ చెప్పేద్దాం.. అని సులువుగా లవ్‌ జర్నీ మొదలుపెడుతున్నారు. అంతే సులువుగా విడిపోతున్నారు. బాలీవుడ్‌లోనూ ఈ ధోరణి విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కోవలోకే వస్తుంది మాజీ ప్రేమ జంట బషీర్‌ అషీ-నిఖిత భమిడిపాటి! తాజాగా నిఖిత తన బ్రేకప్‌కు గల కారణాల్ని బయటపెట్టింది.

చెత్త రిలేషన్‌..
ప్రియుడి మాటలు, చేష్టలు నచ్చకే విడిపోయానంటోంది నటి. ఓ పాడ్‌క్యాస్ట్‌లో నిఖిత మాట్లాడుతూ.. 'నా జీవితంలోనే అది అత్యంత చెత్త రిలేషన్‌షిప్‌. పనికిమాలిన వ్యక్తుల గురించి మాట్లాడాలంటేనే కంపరంగా ఉంది. మా సంబంధం చాలా విషపూరితమైంది. కానీ అప్పుడు మా జీవితాల్లో చాలామందిని దూరం చేసుకున్నాం. అలా చేయకుండా ఉండాల్సింది! ఇప్పుడు కూడా అతడు బయట నా గురించి మాట్లాడుతున్నాడంటే అది పబ్లిసిటీ కోసమే అనిపిస్తోంది. అయినా మాదసలు రిలేషనే కాదు, జస్ట్‌ టైం వేస్ట్‌ చేశాం. ఎమోషన్స్‌ను కూడా వృథాం చేశాం.

అసభ్యంగా మాట్లాడేవాడు
అయితే ఒక్క విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను. అతడు నన్ను మోసం చేయలేదు, నేను తనని మోసం చేయలేదు. కాకపోతే మా బంధం ప్రేమానురాగాలతో కాకుండా రాగద్వేషాలతోనే సాగింది. అసలు మేమిద్దరం ఎందుకు కలిసున్నామో కూడా అర్థం కావడం లేదు. బషీర్‌ నోటికొచ్చింది మాట్లాడేవాడు. అసభ్య పదజాలంతో దూషించేవాడు. నన్ను కంట్రోల్‌ చేయాలని ప్రయత్నించాడు. అప్పుడు నేనూ ఎదురుతిరిగాను' అని చెప్పుకొచ్చింది నిఖిత. 

నలుగురితో లవ్వాయణం
కాగా నిఖిత.. స్ప్లిట్స్‌విల్లా 13వ సీజన్‌లో పాల్గొన్నప్పుడు సామర్థ్య గుప్తాతో ప్రేమలో పడింది. కానీ ఈ ప్రేమ ఎంతోకాలం సాగలేదు. ఆ తర్వాత నటుడు బషీర్‌ అలీని ప్రేమించింది. ఏడాది తిరిగేలోపే ఈ ప్రేమబంధం కూడా ముక్కలైంది. ఆ తర్వాత ఈ మోడల్‌.. టెంప్టేషన్‌ ఐలాండ్‌ ఇండియా అనే రియాలిటీ షోలో పాల్గొంది. ఇందులో తనకు జోడీగా వచ్చిన ప్రియుడు తాన్యేతో కొంతకాలం పాటు డేటింగ్‌ చేసి అదే షోలో బ్రేకప్‌ చెప్పేసింది. అదే షోలో హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ రెండవ సీజన్‌ కంటెస్టెంట్‌ జద్‌ హదీద్‌తో లవ్‌లో పడ్డట్లు పేర్కొంది.

చదవండి: టాలీవుడ్‌లో ఒక్క సినిమా లేదు.. బుట్టబొమ్మకు లక్కీ ఛాన్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement