జోధ్‌పూర్‌కు చెందిన మోడల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటనలో రాజస్థాన్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులిద్దరు ఉదయ్‌పూర్‌కు చెందిన వారు కాగా వారిలో ఓ మహిళ, పురుషుడు ఉన్నారు. వారి పేర్లు దీపాలి, అక్షయ్‌గా పోలీసులు తెలిపారు. కాగా జోధ్‌పూర్‌కు చెందిన ఫ్యాషన్ మోడల్ గున్‌గున్ ఉపాధ్యాయ్ రతనాద ప్రాంతంలోని లార్ట్స్ ఇన్ హోటల్‌లో శనివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గున్‌గున్ తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
చదవండి: తండ్రికి చెప్పి ఆరో అంతస్థు నుంచి దూకిన మోడల్
ఈ ఘటనపై బాధితురాలు, ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా... ఈ కేసులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. గున్‌గున్‌ను ఉపయోగించి భిల్వారా మంత్రిని హనీ ట్రాప్‌కు గురి చేసేందుకు నిందితులు ప్లాన్ చేసినట్లు తేలింది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలోని భిల్వారాకు చెందిన మంత్రి నిందితుల ఫైల్‌ను క్లియర్ చేసేందుకు నిరాకరించారు. దీంతో ఆయనను హనీ ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయాలని నిందితులు దీపాలి, అక్షయ్‌లు ప్లాన్ చేసి గున్‌గున్‌ను వాడుకోవాలని చూశారని డీసీపీ భువన్ భూషన్ తెలిపారు. ప్లాన్ ప్రకారం మోడలింగ్ అసైన్‌మెంట్ ఉందంటూ నిందితులు గున్‌గున్‌ను పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ షోలో అవకాశం ఉన్నట్లు నమ్మించి బాధితురాలిని భిల్వారా తీసుకెళ్లారు.
చదవండి: వరుణ్ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే..
అక్కడికి వెళ్లాక మంత్రితో గడపాలని నిందితులు ఆమెను బలవంతం చేశారు. దీనికి గున్‌గున్ నిరాకరించి వారి నుంచి తప్పించుకుని జోధ్‌పూర్ చేరుకుంది. అక్కడ లార్డ్స్ ఇన్ హోటల్‌లో దిగి తన తండ్రికి ఫోన్ చేసి జరిగిందంతా వివరించి, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తండ్రికి చెప్పింది. ఆమె తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అతడి సమచారంతో పోలీసులు వెంటనే హోటల్‌కు చేరుకున్నారు. కానీ అప్పటికే గున్‌గున్ హోటల్‌పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని డీసీపీ మీడియాకు తెలిపారు. అనంతరం గున్‌గున్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మోడల్ కాళ్లు, ఛాతీ భాగం ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment