వోటేస్తే ఫ్రీ చెకప్
'వోటేస్తే వైద్యంలో డిస్కౌంట్' ఇదీ రాజస్థాన్ లో తాజా ట్రెండ్. ప్రజలను వోటు వేసేందుకు ప్రోత్సహించేలా పలు హాస్పిటల్స్ ఈ తరహా డిస్కౌంట్లు ఇస్తున్నాయి. జైపూర్, జోధ్ పూర్ వంటి ప్రాంతాల్లో ఈ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
అయితే డిస్కౌంట్ కావాలంటే చూపుడు వేలుపై ఎన్నికల ఇంకు గుర్తును చూపించాల్సి ఉంటుంది. ఓటు వేసిన వారికి కన్సల్టేషన్ ఫీజులో 20 శాతం రాయితీ ఉంటుంది. ఔట్ పేషంట్ పరీక్షలలో 10 శాతం డిస్కౌంట్, వైద్య పరీక్షల్లో అయిదుశాతం రాయితీ ఉంటుంది. 'ప్రజల్లో వోటింగ్ పట్ల చైతన్యం పెరిగేందుకు మా వంతు చిన్ని కృషిని మేము చేస్తున్నాం. దీని వల్ల కొద్ది మంది మనసుల్లో మార్పు వచ్చినా మాకు చాలు.' అంటున్నారు ఈ వైద్యులు.
రాజస్థాన్ లో ఏప్రల్17 న తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి.