
...ఇది నిజములే అన్న రేంజ్‌లో ప్రియాంకా చోప్రా, ఆమెకు కాబోయే భర్త నిక్ జానస్‌లు సమయాన్ని గడుపుతున్నారు. గత నెలంతా ఓ ప్రముఖ కుటుంబానికి చెందిన నిశ్చితార్థం వేడుక నిమిత్తం దాదాపు నెల రోజులు ఇటలీలో ఎంజాయ్ చేసిన ఈ జంట తాజాగా ముంబైలో షికార్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోనాలీ బోస్ దర్శకత్వంలో ఫర్హాన్ అక్తర్, ప్రియాంకా చోప్రా, జైరా వసీమ్ ముఖ్య పాత్రలుగా ‘ది స్కై ఈజ్ పింక్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో ఈ సినిమా రాత్రి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్రబృందం.
ఈ సినిమా లొకేషన్‌లోకి అకస్మాత్తుగా వచ్చారట నిక్ జానస్. అంతేకాదు ప్రియాంక కేరవ్యాన్‌లో వెళ్లి ప్రేమ ముచ్చట్లు చెప్పారట. గత ఆదివారం ప్రియాంక సమక్షంలో నిక్ జానస్ బాలీవుడ్ యాక్టర్స్‌తో కలిసి ముంబైలో ఫుట్‌బాల్ ఆడిన విషయం తెలిసిందే. గమ్మతైన విషయం ఏంటంటే.. నిక్ ముంబై వస్తున్నట్లు ప్రియాంకకు తెలియనే తెలియదట. ప్రియురాలికి స్వీట్ షాకిచ్చారన్న మాట. ఈ నెల 10న ‘ది స్కై ఈజ్ పింక్’ షెడ్యూల్ లండన్‌లో మొదలవుతుంది. అక్కడ కూడా ప్రేమ షికార్లు చేయడానికి ఈ జంట ప్లాన్ చేస్తున్నారట. ఇలా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు.