రూ 1999కే ఆ నగరాలకు విమాన యానం | Indigo Airline To Launch New Destinations | Sakshi
Sakshi News home page

రూ 1999కే ఆ నగరాలకు విమాన యానం

Published Tue, Jul 23 2019 3:33 PM | Last Updated on Tue, Jul 23 2019 3:37 PM

Indigo Airline To Launch New Destinations - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రయాణీకులకు తీపికబురు అందించింది. న్యూఢిల్లీ నుంచి జోధ్‌పూర్‌కు ఈ ఏడాది సెప్టెంబర్‌ 5 నుంచి నేరుగా విమాన సర్వీసులను అందించనుంది. ఈ రూట్‌లో విమాన చార్జీలను రూ 1999గా నిర్ణయించింది. జోధ్‌పూర్‌తో పాటు ఢిల్లీ-అగర్తలా, ఢిల్లీ -దిబ్రూగఢ్‌ రూట్లలోనూ డైరెర్ట్‌ ఫ్లైట్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే నెల 14న ఈ రూట్లలో విమాన సర్వీసులను ప్రవేశపెడుతోంది.

ఇక అగర్తలా, దిబ్రూగఢ్‌ రూట్లలో విమాన చార్జీలను వరుసగా 3,9999, 4999లుగా నిర్ణయించింది. మరోవైపు ఢిల్లీ, ముంబైలను కలుపుతా ఆరు నూతన అంతర్జాతీయ విమానాలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ-జెడ్డా, ముంబె-దిబ్రూగఢ్‌ రూట్లలో ఇవి సేవలు అందిస్తాయని ఇండిగో ఎయిర్‌లైన్‌ వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement