
విస్మయపరుస్తున్న సీసీటీవీ దృశ్యాలు
రాజస్థాన్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు విస్మయపరుస్తున్నాయి.
జోధ్‌పూర్: రాజస్థాన్‌లో సోమవారం జరిగిన ఓ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వీక్షకులను విస్మయపరుస్తున్నాయి. జోధ్‌పూర్‌లోని ఓ ఎలక్ట్రానిక్ షోరూంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు.
హెల‍్మెట్ ధరించి వచ్చిన ఆ వ్యక్తిని షాపులోని వారు ముందుగా కస్టమర్‌గా భావించి వివరాలు అడుగుతుండగానే.. అతడు గన్ తీశాడు. దీంతో భయంతో అంతా తలోదిక్కున నక్కగా.. కౌంటర్ వద్ద ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్న దుండగుడు అతి సమీపం నుంచి కాల్పులు జరిపి ఉడాయించాడు.