
జైపూర్: రాజస్థాన్‌లోని సోమవారం రాత్రి ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రెండు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి చివరకు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు.
వివరాల ప్రకారం.. జోధ్‌పూర్ జిల్లాలోని బాల్‌ముకంద్ బిస్సా సర్కిల్‌లో ఓ వర్గం జెండాలను తొలగించి మరో వర్గానికి చెందిన జెండాలను పాతడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ప్రార్థనల కోసం ఏర్పాటు చేసిన లౌడ్‌స్పీకర్లను కొందరు తొలగించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తకరంగా మారి రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి.
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాల యువకులను చెదరగొట్టారు. ఈ ఘర‍్షణలో కొందరు యువకులు, నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. కాగా, ఈ ఘటనపై సీఎం అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ ప్రజలందరూ శాంతి, సామరస్యంతో ఉండాలని కోరారు. అలాగే, ముందు జాగ్రత్త చర్చగా జిల్లాలో వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియాను, మొబైల్ డేటాతో పాటుగా ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: సంక్షోభంలో బొమ్మై ప్రభుత్వం?.. రంగంలోకి అమిత్ షా
Comments
Please login to add a commentAdd a comment