Internet services suspended
-
నూహ్‌లో మళ్లీ ఇంటర్నెట్ సేవలు బంద్
చండీగఢ్: శోభాయాత్ర పిలుపు నేపథ్యంలో నూహ్ జిల్లాలో ఈ నెల 28 వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించడంతోపాటు నిషేధాజ్ఞలు అమలు చేయాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 31వ తేదీన జరిగిన మతపర ఘర్షణల నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చర్యలు తీసుకున్నట్లు వివరించింది. నూహ్‌లో సోమవారం తలపెట్టిన శోభాయాత్రకు అనుమతులు నిరాకరించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఢిల్లీలో సెప్టెంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు జరిగే జి–20 షెర్పా సమావేశాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయించామన్నారు. మొబైల్ ఇంటర్నెట్తోపాటు ఎస్ఎంఎస్ సర్వీసులపైనా నిషేధం విధించామన్నారు. సంఘ విద్రోహ శక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా వదంతుల వ్యాప్తి చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యమని చెప్పారు. ఈ నెల 26–28 తేదీల మధ్య 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని డీజీపీ శత్రుజీత్ కపూర్ చెప్పారు. -
ఇంటర్నెట్ నిలిపివేతకు ప్రొటోకాల్ ఉందా: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో ఇష్టారాజ్యంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడానికి ఏదైనా ప్రొటోకాల్ ఉందా? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్లో తరచుగా ఇంటర్నెట్ సేవలు బంద్ చేస్తున్నారని ఆరోపిస్తూ సాఫ్ట్వేర్ లా సెంటర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు నోటీసు జారీ చేసింది. సాఫ్ట్వేర్ లా సెంటర్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని ఆదేశించింది. ప్రొటోకాల్ ఏదైనా ఉంటే తమకు తెలియజేయాలని పేర్కొంది. నాలుగు రాష్ట్రాలకు నోటీసు ఇవ్వడం లేదని తెలిపింది. -
పాక్... మరో శ్రీలంక
ఇస్లామాబాద్: శ్రీలంక మాదిరిగానే పాకిస్తాన్ కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో గంటల కొద్దీ విద్యుత్ కోతలు అమల్లో ఉండటంతో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని పాకిస్తాన్ ప్రభుత్వమే ప్రజలను హెచ్చరించింది. విద్యుత్ కోతల కారణంగా ఇప్పటికే మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని శుక్రవారం నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డ్ (ఎన్ఐబీటీ) ట్విట్టర్లో తెలిపింది. దేశ అవసరాలకు సరిపోను ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ) అందకపోవడంతో జూలైలో ఈ సమస్య మరింత తీవ్రం కావచ్చని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా ఇటీవల పేర్కొన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ డిమాండ్ ఒక వైపు పెరుగుతుండగా జూన్‌లో దిగుమతులు తగ్గిపోయినట్లు జియో న్యూస్ పేర్కొంది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా కరాచీ తదితర నగరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీల్లో పని గంటలను కుదించారు. ఇంధన కొరతను అధిగమించేందుకు ఖతార్‌తో చర్చలు జరుగుతున్నాయి. విదేశీ కరెన్సీ నిల్వలు పడిపోవడంతో దేశంలో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా రెట్టింపయింది. -
‘తపాడియా’ దారుణ హత్య.. సీఎం సంచలన నిర్ణయం
రాజస్తాన్‌లో రోజురోజుకు ఉద్రిక్తర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భిల్వారాలో ఓ వర్గానికి చెందిన యువకుడిని మరో వర్గానికి చెందినవారు దారుణ చంపడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. దీంతో సీఎం అశోక్ గెహ్లాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను గురువారం ఉదయం వరకు నిలిపివేశారు. వివరాల ప్రకారం... భిల్వారాకు చెందిన ఆదర్శ్ తపాడియా(22)ను ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి కత్తితో పొడిచి చంపారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని తపాడియాను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో తపాడియాను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో భిల్వారాలో పోలీసు బలగాలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులకు అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తపాడియా మృతి కారణంగా ఉద్రిక్తతల నేపథ్యంలో ముందు జాగ్రత చర్యల్లో భాగంగా రాజస్తాన్ ప్రభుత్వం భిల్వారాలో గురువారం ఉదయం వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈద్ పండుగ సందర్భంగా సీఎం అశోక్ గెహ్లాట్ స్వస్థలమైన జోధ్‌పూర్‌లో మత ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. Rajasthan | A 22-year-old man was allegedly stabbed to death in Kotwali Police Station area of Bhilwara last night. Police forces deployed in the area. Internet services in Bhilwara to remain suspended till 6 am on Thursday, 12th May in wake of the incident. pic.twitter.com/lStcjtqiNP — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 11, 2022 ఇది కూడా చదవండి: నెల్లూరు కాల్పుల ఘటన.. బిహార్‌లో పిస్టల్ కొన్న సురేష్‌రెడ్డి! -
పండుగ వేళ టెన్షన్.. టెన్షన్.. ఇంటర్నెట్, సోషల్ మీడియా బంద్
జైపూర్: రాజస్థాన్‌లోని సోమవారం రాత్రి ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రెండు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి చివరకు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. వివరాల ప్రకారం.. జోధ్‌పూర్ జిల్లాలోని బాల్‌ముకంద్ బిస్సా సర్కిల్లో ఓ వర్గం జెండాలను తొలగించి మరో వర్గానికి చెందిన జెండాలను పాతడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ప్రార్థనల కోసం ఏర్పాటు చేసిన లౌడ్స్పీకర్లను కొందరు తొలగించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తకరంగా మారి రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాల యువకులను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో కొందరు యువకులు, నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. కాగా, ఈ ఘటనపై సీఎం అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ ప్రజలందరూ శాంతి, సామరస్యంతో ఉండాలని కోరారు. అలాగే, ముందు జాగ్రత్త చర్చగా జిల్లాలో వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియాను, మొబైల్ డేటాతో పాటుగా ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: సంక్షోభంలో బొమ్మై ప్రభుత్వం?.. రంగంలోకి అమిత్ షా -
పంజాబ్‌లో టెన్షన్.. టెన్షన్.. ఇంటర్నెట్ సేవలు బంద్
Patiala Clashes Punjab: పంజాబ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాటియాలలో శివసేన కార్యకర్తలకు, ఖలిస్థాన్ మద్దతుదారులకు మధ్య శుక్రవారం ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాళీ మాత ఆలయం వెలుపల ఇరువర్గాల సభ్యులు కత్తులు ఊపుతూ ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎం భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతల విషయంలో వైఫల్యం చెందడంతో ప్రభుత్వం రాష్ట్ర పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంది. హింసను నియంత్రించడంలో విఫలమైనందుకు డిపార్ట్మెంట్లోని ముగ్గురు ఉన్నతాధికారులను భగవంత్ మాన్ సర్కార్ తొలగించింది. పాటియాలా రేంజ్ ఐజి, పాటియాలా ఎస్ఎస్పీ, ఎస్పీలను ఆ పదవి నుండి బదిలీ చేశారు. पटियाला में आज सुबह 9:30 से शाम 6 बजे तक मोबाइल इंटरनेट सेवाएं अस्थायी रूप से निलंबित किया गया: गृह विभाग, पंजाब सरकार | #Patiala | #PatialaViolence | #PatialaRiots | #Panjab | pic.twitter.com/KEFsOoi62j — IBC24 News (@IBC24News) April 30, 2022 ఇదిలా ఉండగా.. ఘర్షణల కారణంగా శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాజియాలా జిల్లాలో శనివారం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాయిస్ కాల్స్ మినహా మొబైల్ ఇంటర్నెట్, SMS సేవలను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఇప్పటికే నగరంలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ అమలులో ఉంది. #Patiala pic.twitter.com/0XgntqTEcG — Jitender Sharma (@capt_ivane) April 29, 2022 ఇది కూడా చదవండి: భారత్‌లో కరోనా.. అంతకంతకు పెరుగుతున్న కేసులు -
భైంసాలో కొనసాగుతున్న144 సెక్షన్
-
వదంతులతో ఇంటర్నెట్ సేవలకు బ్రేక్
శ్రీనగర్ : కశ్మీర్లో బుధవారం అర్ధరాత్రి ఆకస్మాత్తుగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ ఆరోగ్య పరిస్థితిపై వదంతులు చెలరేగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. గిలానీ ఆరోగ్యం క్షీణించిందని బుధవారం రాత్రి సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు పోస్టులు పెట్టినట్టు అధికారులు తెలిపారు. తప్పుడు వార్తలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతోనే మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశామని చెప్పారు. అలాగే శాంతి భద్రతలను అదుపు తప్పకుండా ఉండేందుకు కశ్మీర్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మొహరించామని అన్నారు. మరోవైపు గిలానీ ఆరోగ్యంపై అతని కుటుంబ సభ్యులు స్పందించారు. గిలానీ కొద్దిపాటి అనారోగ్యానికి గురయ్యారని.. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. కాగా, జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణ రద్దు అనంతరం కేంద్రం అక్కడ అన్నిరకాల సమాచార వ్వవస్థలను కొద్ది నెలలపాటు స్తంభింప చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో గిలానీ రెచ్చగొట్టేలా ట్వీట్లు చేయడం కలకలం రేపింది. దీంతో ట్విటర్ ఆయన ఖాతాను నిలిపివేసింది. అయితే సమాచార వ్యవస్థపై అంక్షలు ఉన్నప్పటికీ.. గిలానీ ట్వీట్ చేసేందుకు సహకరించిన బీఎస్ఎన్ఎల్కు చెందిన ఇద్దరు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. (చదవండి: ‘మళ్లీ డిటెన్షన్..! ఇదంతా పక్కా ప్లాన్’) -
ఇంటర్నెట్ సర్వీసులు బంద్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కశ్మీర్లో శనివారం కొంచెంసేపు ఇంటర్నెట్ సర్వీసులు రద్దు చేశారు. బ్రాడ్ బాండ్ సర్వీసులను ఈ రోజు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఆపివేశారు. అరగంట తర్వాత 5 గంటల సమయంలో పునరుద్ధరించారు. అధికారులు ఇందుకుగల కారణాలను వెల్లడించలేదు. కాగా కొన్ని బ్రాడ్ బాండ్ వినియోగదారులు మాత్రం ఇంటర్నెట్ కనెక్షన్లను ఇంకా పునరుద్ధరించలేదని చెబుతున్నారు. బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సర్వీసులు పనిచేయలేదని ఓ వినియోగదారుడు చెప్పాడు. భద్రత దళాల ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ హతమయ్యాక, కశ్మీర్లో గత నెల రోజులుగా కొనసాగుతున్న కల్లోలిత పరిస్థితుల కారణంగా మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేశారు. అల్లర్లు వ్యాపించకుండా భద్రత దళాలు ఈ చర్యలు తీసుకున్నాయి. -
జమ్ములో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
శ్రీనగర్: జమ్మూలో మరోసారి మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి. జమ్మూలో హింస నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మొబైల్, ఇంటర్ నెట్ సర్వీసులను నిలిపివేసినట్లు జిల్లా మెజిస్ట్రేట్ సింరాన్దీప్ సింగ్ బుధవారమిక్కడ తెలిపారు. ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాత సర్వీసులను పునరుద్దరిస్తామన్నారు. కాగా రూప్‌నగర్ ప్రాంతంలో ఓ పురాతన హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలతో రెండు వర్గాలు ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. అది కాస్తా ఉద్రిక్తంగా మారటంతో ఆందోళనకారులు రెండు స్కూల్ బస్సులతో పాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో సోషల్ మీడియాలో దుష్ర్పచారం, వదంతులు చెలరేగే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా అల్లర్లకు సంబంధం ఉన్న పలువురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కర్ఫ్యూ విధించినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. మరోవైపు జమ్మూలో హింసపై కశ్మీర్ అసెంబ్లీలో విపక్షాల ఆందోళనకు దిగాయి. దీంతో అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా మారాయి.