ఇంటర్నెట్ సర్వీసులు బంద్ | Internet services suspended briefly in Kashmir, then restored | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్ సర్వీసులు బంద్

Published Sat, Aug 13 2016 6:29 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

ఇంటర్నెట్ సర్వీసులు బంద్

ఇంటర్నెట్ సర్వీసులు బంద్

శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కశ్మీర్లో శనివారం కొంచెంసేపు ఇంటర్నెట్ సర్వీసులు రద్దు చేశారు. బ్రాడ్ బాండ్ సర్వీసులను ఈ రోజు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఆపివేశారు. అరగంట తర్వాత 5 గంటల సమయంలో పునరుద్ధరించారు. అధికారులు ఇందుకుగల కారణాలను వెల్లడించలేదు.

కాగా కొన్ని బ్రాడ్ బాండ్ వినియోగదారులు మాత్రం ఇంటర్నెట్ కనెక్షన్లను ఇంకా పునరుద్ధరించలేదని చెబుతున్నారు. బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సర్వీసులు పనిచేయలేదని ఓ వినియోగదారుడు చెప్పాడు. భద్రత దళాల ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ హతమయ్యాక, కశ్మీర్లో గత నెల రోజులుగా కొనసాగుతున్న కల్లోలిత పరిస్థితుల కారణంగా మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేశారు. అల్లర్లు వ్యాపించకుండా భద్రత దళాలు ఈ చర్యలు తీసుకున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement