
ముంబై-ఢిల్లీ విమానానికి తప్పిన ముప్పు!
ఎయిర్ ఇండియా విమానానికి పెద్దప్రమాదం తప్పింది.
జైపూర్: ఎయిర్ ఇండియా విమానానికి పెద్దప్రమాదం తప్పింది. ముంబై నుంచి వచ్చిన ఈ విమానం జోద్పూర్లో ఉదయం 11.40 గంటలకు కిందకు దిగిన వెంటనే టైరు పేలింది. ఆ సమయంలో విమానంలో 128 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. ఈ విమానం ముంబై నుంచి జోద్పూర్ మీదగా ఢిల్లీ వెళ్లవలసి ఉంది.
ఢిల్లీ నుంచి ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది మరో విమానంలో టైర్ తీసుకొని వచ్చారు. సిబ్బంది విమానానికి టైర్ మార్చి, మరమ్మతులు చేశారు. ఆ తరువాత మూడు గంటలు ఆలస్యంగా సాయంత్రం 4.05 గంటలకు విమానం ఢిల్లీ బయలుదేరింది.
**