సాక్షి, జోధ్‌పూర్ : దేశంలో కులతత్వం రోజురోజుకూ పెరిగిపోతోందని ఆరెస్సెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాగే కొనసాగితే దేశానికే ప్రమాదం అని, జాతీయత భావం దెబ్బతింటుందని పేర్కొంది. వెంటనే సామాజిక సామరస్యాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. కుటుంబ విలువలు-జాతీయ సామరస్యం వంటి అంశాలపై ఆరెస్సెస్ రెండు రోజులపాటు సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో అరుణ్ చతుర్వేది, గులాబ్ చంద్ కఠారియా, వాసుదేవ్ దేవ్‌నానాయ్, బీజేపీ నేతలు సతిష్ పునియా, అశోక్ పార్నమి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కులవాదం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 'దేశానికి క్యాస్టిజం పెద్ద ప్రమాదంగా మారింది. గుజరాత్ ఎన్నికల్లో ఆ విషయం స్పష్టమైంది. పెరుగుతున్న ఆందోళనల దృష్ట్యా దీనిని ఆరెస్సెస్ తీవ్రంగా పరిగణిస్తోంది. సమాజంలో సామరస్యం పెంపొందించేందుకు కృషిచేయాలని నిర్ణయించుకున్నాం' అని తెలిపారు.
దేశంలో ప్రమాదకరంగా కులతత్వం..
Published Sat, Dec 16 2017 4:39 PM | Last Updated on Sat, Dec 16 2017 4:39 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment