రాజస్థాన్: రాజస్థాన్లోని జోధ్పూర్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుఎదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం జోధ్పూర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.