వాషింగ్టన్: జార్జ్‌ఫ్లాయిడ్ హత్యోదంతంపై అమెరికాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 40 నగరాల్లో కర్ఫ్యూ విధించగా.. సుమారు 150 నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆరు రాష్ట్రాలతోపాటు 13 నగరాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. ఇక జార్జ్‌ఫ్లాయిడ్ మృతికి నిరసనగా చేపట్టిన ఆందోళనలకు మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ మద్దతు పలికిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కూతురు టిఫనీ ట్రంప్ జార్జ్‌ఫ్లాయిడ్ హత్యపై చెలరేగుతున్న నిరసనలకు మద్దతు పలికారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ తాఖాలో ఒక బ్లాక్ ఫొటోను పోస్ట్ చేశారు. (నలుగురు పోలీసులకు శిక్ష పడాలి: జార్జ్ భార్య)
‘ఒంటరిగా మనం చాలా తక్కువ సాధించగలము, కలిసి మనం చాలా సాధించగలము’ అని హెలెన్ కెల్లర్ చెప్పిన మాటను కామెంట్‌గా జతచేశారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా #బ్లాక్‌ఆవుట్ ట్యూస్‌డే, #జస్టిస్ ఫర్ జార్జ్‌ఫ్లాయిడ్. అనే హాష్ట్యాగ్లతో సోషల్ మీడియాలో నెటిజన్లు జార్జ్‌ఫ్లాయిడ్ హత్య నిరసనలకు మద్దతుగా నిలుస్తున్నారు. జార్జ్‌ఫ్లాయిడ్ హత్య, జాత్యహంకారానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాలను పలు రాష్ట్రాలు అణచివేయడంలో విఫలమైతే సైన్యాన్ని రంగంలోకి దింపేందుకూ వెనుకాడనని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వయంగా ట్రంప్ చిన్న కూతురు టిఫనీ సోషల్ మీడియా వేదికగా జాత్యహంకార వ్యతిరేక నిరసనలకు మద్దతు పలకడం సర్వత్రా చర్చనీయం అంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment