Tiffany
-
చరిత్ర సృష్టించిన గాజు కిటికీ
దూరం నుంచి చూస్తే నల్లని వస్త్రంపై చిత్రకారుడి కలం నుంచి జాలువారిన అద్భుత చిత్రరాజం అనిపించకమానదు. కానీ దగ్గరికెళ్లి తరచిచూస్తే సప్తవర్ణశోభితమై ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే ఒక అద్దం కిటికీ అని వెంటనే తెలుస్తుంది. అపురూప కళాఖండంగా దశాబ్దాల క్రితమే ఘన కీర్తిని మూటగట్టుకున్న ఈ గాజు కిటీకి మళ్లీ రెండు పుష్కరాల తర్వాత కొచ్చింది. 24 ఏళ్ల క్రితం రూ.16 కోట్లకుపైబడి ధర పలికి ఔరా అనిపించిన ఈ గాజు కిటికీ తాజాగా సోమవారం ఏకంగా రూ.105 కోట్లకు అమ్ముడుపోయి తన విశిష్టతకు ఏ అద్దమూ సాటిరాదని నిరూపించుకుంది. 20వ శతాబ్దానికి చెందిన అమెరికన్ కళాకారుడు లూయిస్ కంఫర్ట్ టిఫానీ ఈ గాజు కిటికినీ తయారుచేశారు. అలంకార, సౌందర్య కళల్లో లూయిస్‌ది అందె వేసిన చేయి. స్టెయిన్ గ్లాస్‌తో ఆయన చేసిన కళాకృతులు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిపొందాయి. ఓహియో రాష్ట్రంలోని క్యాంటన్ సిటీలో తొలి బాప్టిస్ట్ చర్చి వ్యవస్థాపకుల్లో ఒకరైన జాన్ థెరిసా డ్యానర్ గౌరవార్థం లూయిస్ ఈ కిటికీని తయారుచేశారు. అందుకే దీనిని ‘డ్యానర్ మెమోరియల్ విండో’అంటారు. 16 అడుగుల కళాఖండం సోమవారం న్యూయార్క్‌లోని సోత్బే వేలంసంస్థ నిర్వహించిన వేలంలో కేవలం ఆరున్నర నిమిషాల్లో ఊహించినదానికంటే నాలుగు రెట్లు అధిక ధరకు ఇది అమ్ముడుపోవడం విశేషం. బిలియనీర్ అలెన్ గెర్రీ దీనిని విక్రయించగా ఒక గుర్తు తెలియని వ్యక్తి దీనిని కొనుగోలుచేశారని సోత్బే సంస్థ ప్రకటించింది. టిఫానీ రూపొందించిన కిటీకీల్లో ఇంతవరకు ఇంత భారీ ధరకు అమ్ముడుపోయిన తొలి గాజు కిటికీ ఇదే. వాస్తవానికి చర్చి కోసం దీనిని తయారుచేసినా చివరకు వినియోగించకుండా వదిలేశారు. గలగలపారే సెలయేరుకు ఇరువైపులా విరగగాసిన ఫలాలతో అలరారుతున్న వృక్షాలు ఊసులాడుకుంటున్నట్లు ఎంతో రమ్యంగా రంగులద్దారు. డిజైన్ ఆగ్నిస్ నార్త్రోప్ ఈయనకు సాయపడ్డారు. 1913లో దీని తయారీ పూర్తయింది. ‘‘టిఫానీ రూపొందించిన గాజు కిటికీలు ఇన్నేళ్లు గడిచినా మార్కెట్లో తమ హవా కొనసాగిస్తున్నాయనడానికి ఈ కిటికీ వేలమే నిదర్శనం’’అని సోత్బే చైర్మన్ జోడీ పొల్లాక్ అన్నారు. లూయిస్ టిఫానీ వాళ్ల నాన్నకు అమెరికాలో టిపానీ అండ్ కో. పేరిట స్టెయిన్ గ్లాస్ తయారీ కర్మాగారం ఉండేది. అందులో పనిచేస్తూనే టిఫానీ ఎన్నో కళాఖండాలను సృష్టించారు. గాజు దీపాలు, పుష్పలంకరణ వస్తువులను తయారుచేశారు. అమెరికాలోని న్యూయార్క్‌తోపాటు బ్రిటన్‌లోని లండన్, ఫ్రాన్స్‌లోని పారిస్ సొంత స్టోర్లలో ఈయన కళారూపాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. పెన్సిల్వేనియా, మసాచు సెట్స్, న్యూయార్క్‌లోని చాలా చర్చిల్లో ఈయన గాజు కిటీకీలే మనకు దర్శనమిస్తాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జార్జ్ ఫ్లాయిడ్ నిరసనలు.. ట్రంప్‌కు షాక్
వాషింగ్టన్: జార్జ్‌ఫ్లాయిడ్ హత్యోదంతంపై అమెరికాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 40 నగరాల్లో కర్ఫ్యూ విధించగా.. సుమారు 150 నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆరు రాష్ట్రాలతోపాటు 13 నగరాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. ఇక జార్జ్‌ఫ్లాయిడ్ మృతికి నిరసనగా చేపట్టిన ఆందోళనలకు మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ మద్దతు పలికిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కూతురు టిఫనీ ట్రంప్ జార్జ్‌ఫ్లాయిడ్ హత్యపై చెలరేగుతున్న నిరసనలకు మద్దతు పలికారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్ తాఖాలో ఒక బ్లాక్ ఫొటోను పోస్ట్ చేశారు. (నలుగురు పోలీసులకు శిక్ష పడాలి: జార్జ్ భార్య) ‘ఒంటరిగా మనం చాలా తక్కువ సాధించగలము, కలిసి మనం చాలా సాధించగలము’ అని హెలెన్ కెల్లర్ చెప్పిన మాటను కామెంట్‌గా జతచేశారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా #బ్లాక్‌ఆవుట్ ట్యూస్డే, #జస్టిస్ ఫర్ జార్జ్‌ఫ్లాయిడ్. అనే హాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో నెటిజన్లు జార్జ్‌ఫ్లాయిడ్ హత్య నిరసనలకు మద్దతుగా నిలుస్తున్నారు. జార్జ్‌ఫ్లాయిడ్ హత్య, జాత్యహంకారానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాలను పలు రాష్ట్రాలు అణచివేయడంలో విఫలమైతే సైన్యాన్ని రంగంలోకి దింపేందుకూ వెనుకాడనని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వయంగా ట్రంప్ చిన్న కూతురు టిఫనీ సోషల్ మీడియా వేదికగా జాత్యహంకార వ్యతిరేక నిరసనలకు మద్దతు పలకడం సర్వత్రా చర్చనీయం అంశంగా మారింది. View this post on Instagram ”Alone we can achieve so little; together we can achieve so much.”- Helen Keller #blackoutTuesday #justiceforgeorgefloyd A post shared by Tiffany Ariana Trump (@tiffanytrump) on Jun 2, 2020 at 8:52am PDT -
వ్యక్తిగత సిబ్బందికి షాకిచ్చిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలైన మడేలీన్ వెస్టర్‌హౌట్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్టు వైట్‌హౌస్ ప్రకటించింది. ఆమె ఇకపై వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా, అధ్యక్ష కార్యాలయానికి సంబంధించిన కీలక సమాచారాన్ని మడేలీన్ బహిర్గతం చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అంతేగాకుండా, ఓ ప్రెస్మీట్లో ట్రంప్ కుటుంబ సభ్యులకు సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేశారు. ట్రంపు కుమార్తె టిపానీ అధిక బరువు కారణంగా ఆయన తన కుమార్తె ఫోటోను చూడడానికి కూడా ఇష్టపడేవారు కాదని మడేలీన్ అన్నట్లు తెలిసింది. దీంతో, ఆమెపై వేటు పడినట్టు వైట్‌హౌస్ ప్రకటిచింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ 2016లో బధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలిగా ఆమె పనిచేస్తున్నారు. మడేలీస్ పనితీరుపై ట్రంప్ అనేక సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. మడేలీస్ను పదవి నుంచి తొలగించడం పట్ల ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు రిపబిక్లన్ పార్టీ నేతలు కూడా ఒకింత విస్మయానికి గురవుతున్నారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ కుమార్తెలంటే తనకు ఎనలేని ప్రేమని విలేకరుల సమావేశంలో తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ అంశం పై వెస్టర్‌హౌట్ తో మాట్లాడానని.. ఆమె చాలా ఆవేదనలో ఉన్నారని, అనుకోకుండా జరిగిన సంఘటనని అన్నారు. విలేకరుల విందులో భాగంగా అలా మాట్లాడారని, ఆ సమయంలో మద్యం కూడా సేవించినట్లు మడేలిన్ తనతో చెప్పారని ట్రంప్ అన్నారు. -
భారత్‌లో ‘టిఫనీ’ బ్రాండ్..!
న్యూఢిల్లీ: ప్రముఖ అమెరికన్ జ్యుయలరీ సంస్థ టిఫనీ అండ్ కో భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో ఈ ఏడాదిలోనే తొలుత దేశ రాజధాని ఢిల్లీలో స్టోర్‌ను ఏర్పాటుచేయనుంది. వచ్చే ఏడాదిలో ముంబైలో రెండవ స్టోర్ ఏర్పాటుచేయాలని భావిస్తోంది. ఈ అంశానికి సంబంధించి రిలయన్స్ బ్రాండ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దర్శన్ మెహతా మాట్లాడుతూ.. ‘టిఫనీ ప్రఖ్యాత ఆభరణాలు, అత్యుత్తమ వజ్రాభరణాలను భారత మార్కెట్లో పరిచయం చేయాలని భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో 320 స్టోర్లను టిఫనీ నిర్వహిస్తోంది. మొత్తం 14 ఈ–కామర్స్ వెబ్సైట్ల ద్వారా విక్రయాలను కొనసాగిస్తోంది. -
స్కానింగ్ వల్ల గర్భవతులకు, కడుపులోని బిడ్డకు ప్రమాదమా?
నేను ఇప్పుడు ఏడో నెల గర్భవతిని. డాక్టర్లు స్కాన్ చేయించమని చెప్పారు. అయితే ఇంతకు ముపును కూడా ఐదోనెలలో ఒకసారి స్కానింగ్ అయ్యింది. ఇలా తరచూ అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించడం బేబీకి మంచిదేనా? తెలియజేయండి. - సురేఖ, హైదరాబాద్ గర్భవతులకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. సాధారణంగా గర్భధారణ మొత్తం వ్యవధిని... మొదటి మూడు నెలలను మొదటి ట్రైమిస్టర్‌గా, రెండో మూడు నెలల కాలాన్ని రెండో ట్రైమిస్టర్‌గా, ఆఖరి మూడు నెలల కాలాన్ని మూడో ట్రైమిస్టర్‌గా విభజిస్తారు. ఒక్కో ట్రైమిస్టర్ ఒక్కోసారి చొప్పున కనీసం మూడు స్కానింగ్‌లైనా తీయించి చూడటం తల్లికీ, బిడ్డకూ మేలు చేసేందుకే. మొదటి ట్రైమిస్టర్లో అంటే 14 వారాల లోపు చేసే స్కానింగ్‌లో గర్భాన్ని నిర్ధారణ చేయడంతో పాటు లోపల ఎంతమంది బిడ్డలు ఉన్నారు (అంటే కవలలా లేక ఒకే బిడ్డా) అన్న విషయాలు తెలుస్తాయి. దాంతో పాటు బిడ్డ సైజ్, దాన్ని బట్టి ప్రవసం అయ్యే తేదీని కూడా ఉజ్జాయింపుగా చెప్పవచ్చు. ఈ దశలో చేసే స్కానింగ్ ద్వారా బిడ్డకు అంగవైకల్యం వచ్చే అవకాశాలను దాదాపు 50 శాతం నుంచి 60 శాతం వరకు అంచనా వేసేందుకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల కొంతవరకు డౌన్ సిండ్రోమ్ వంటి రుగ్మతలనూ అంచనా వేసే అవకాశమూ ఉంది. ఇక రెండో ట్రైమిస్టర్లో అంటే... 20 వారాల సమయంలో చేసే స్కాన్‌ను ‘టిఫా’ స్కాన్ లేదా ఫీటల్ టార్గెట్ స్కాన్ అంటరు. అంటే ప్రత్యేకంగా బిడ్డలోని ప్రతి అవయవం నిర్దిష్టంగా ఎలా ఉందో టార్గెట్ చేసి చూస్తారు కాబట్టి దీన్ని ఫీటల్ టార్గెట్ స్కాన్ అంటారు. ఈ స్కాన్ ద్వారా బిడ్డకు అంగవైకల్యం కలిగే అవకాశాలను 80 శాతం వరకు కచ్చితంగా చెప్పడానికి ఆస్కారం ఉంది. అందుకే మొదటి ట్రైమిస్టర్లో స్కాన్ చేయించకపోయినా... 18 నుంచి 20 వారాల సమయంలో తప్పకుండా స్కానింగ్ చేయించాలి. ఇక మూడో ట్రైమిస్టర్లో అంటే 34వ వారంలో పొట్టలో బేబీ పొజిషన్‌ను చూస్తారు. ఆ సమయంలో తీసే స్కాన్‌లో బిడ్డ తలకిందులుగా ఉంటే సాధారణ ప్రవసం అవుతుందన్నమాట. ఒకవేళ ఎదురుకాళ్లతో కనిపిస్తే అప్పుడు శస్త్రచికిత్స ద్వారా బిడ్డను బయటకు తీసేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా భారతీయ ప్రమాణాలలో పుట్టినప్పుడు బిడ్డ బరువు 2.5 కిలోల నుంచి 2.8 కిలోల వరకు ఉంటుంది. బిడ్డ పెద్దదిగా ఉందా లేక చిన్నదిగా ఉందా అన్న విషయంతో పాటు ఉమ్మనీరు ఎలా ఉంది అన్న విషయం కూడా స్కాన్‌లో తెలుస్తుంది. దీన్ని బట్టి ఒకవేళ ఉమ్మనీరు తగ్గితే దానికి కారణాలు కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటు మాయ (ప్లాసెంటా) తీరుతెన్నులు కూడా తెలుస్తాయి. ఉదాహరణకు గర్భాశయముఖద్వారానికి (సెర్విక్స్‌కు) దగ్గరగా మాయ ఉండటాన్ని ప్లాసెంటా ప్రివియా అంటారు. నిజానికి ప్రసవంలో బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మాయ బయటకు రావాలి. కానీ ఒకవేళ ముందే మాయ బయటకు వస్తే అప్పుడు తల్లికి తీవ్రమైన రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. ఇది బిడ్డకూ, తల్లికీ ప్రమాదకరమైన పరిస్థితే. అందుకే స్కానింగ్ ద్వారా ప్రసవం అయ్యే తీరును అంచనా వేసి, దానికి తగినట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో కేవలం శబ్దతరంగాలను మాత్రమే ఉపయోగిస్తారు. ఎక్స్-రే లేదా సీటీ స్కాన్‌లో లాగా ప్రమాదకరమైన రేడియేషన్ తరంగాలను ఉపయోగించరు. ఈ శబ్దతరంగాలు ఎంత ప్రమాదరహితమైనవంటే... అవసరాన్ని బట్టి ఒక్కోసారి రోజూ డాప్లర్ స్కానింగ్ చేయించాల్సి రావచ్చు. అప్పుడు కూడా ప్రమాదాన్ని కలిగించవని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి నిరభ్యంతరంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవచ్చు. కాకపోతే పుట్టబోయే బిడ్డ... ఆడా, మగా అని మాత్రం అడగవద్దు. అది మాత్రమే అభ్యంతరకరం. డాక్టర్ సుశీల వావిలాల ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్