
న్యూఢిల్లీ: ప్రముఖ అమెరికన్ జ్యుయలరీ సంస్థ టిఫనీ అండ్ కో భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో ఈ ఏడాదిలోనే తొలుత దేశ రాజధాని ఢిల్లీలో స్టోర్‌ను ఏర్పాటుచేయనుంది. వచ్చే ఏడాదిలో ముంబైలో రెండవ స్టోర్ ఏర్పాటుచేయాలని భావిస్తోంది. ఈ అంశానికి సంబంధించి రిలయన్స్ బ్రాండ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దర్శన్ మెహతా మాట్లాడుతూ.. ‘టిఫనీ ప్రఖ్యాత ఆభరణాలు, అత్యుత్తమ వజ్రాభరణాలను భారత మార్కెట్లో పరిచయం చేయాలని భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో 320 స్టోర్లను టిఫనీ నిర్వహిస్తోంది. మొత్తం 14 ఈ–కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా విక్రయాలను కొనసాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment