కూచిభొట్ల కేసు: నిందితుడికి ఉరిశిక్ష?
కూచిభొట్ల కేసు: నిందితుడికి ఉరిశిక్ష?
Published Sat, Jun 10 2017 7:26 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM
కాన్సాస్: అమెరికాలో దారుణహత్యకు గురైన తెలుగు యువకుడు శ్రీనివాస్ కూచిభొట్ల కేసు విచారణ తుది దశకు చేరింది. ఈ కేసులో నిందితుడైన ఆడమ్ పురింటన్‌పై జాత్యాహంకార దాడికి పాల్పడినట్లు అభియోగాలు నమోదు చేశారు. ఫిబ్రవరి 22న కాన్సాస్‌లో శ్రీనివాస్‌ను హత్య చేసి.. మరో ఇద్దరిని నిందితుడు ఆడమ్ పురింటన్ గాయపరిచాడు.
ఈ కేసులో నిందితునికి ఉరిశిక్ష లేదా జీవితఖైదు పడే అవకాశం ఉంది. తమ దేశం విడిచి వెళ్లండి అంటూ బిగ్గరగా అరుస్తూ నిందితుడు కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షి కోర్టుకు తెలిపాడు. ఫిబ్రవరి 22న జరిగిన ఈ ఘటనలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలు కోల్పోగా.. మరో ప్రవాసుడు ఆలోక్ మాదసాని గాయపడ్డారు. వీరిని కాపాడేందుకు యత్నించిన 24 ఏళ్ల అమెరికన్ ఇయాన్ గ్రిల్లాట్ కూడా తీవ్రగాయాలపాలయ్యాడు.
Advertisement
Advertisement