
న్యూజిలాండ్‌లో ఇండియన్‌పై రేసిస్ట్ కామెంట్స్
న్యూజిల్యాండ్‌లో ఓ భారతీయుడిపై అక్కడి పౌరుడు జాత్యహంకార దూషణలకు దిగాడు.
న్యూజిల్యాండ్‌లో ఓ భారతీయుడిపై అక్కడి పౌరుడు జాత్యహంకార దూషణలకు దిగాడు. రోడ్డు మీద వాహనం నడుపుతున్న సమయంలో జరిగిన సంఘటన ఈ ఉదంతానికి కారణంగా అక్కడి మీడియా పేర్కొంది. గత కొద్ది రోజులుగా అమెరికాలో భారతీయులపై జాత్యహంకార దాడులు జరగుతున్న విషయం తెలిసిందే. కారు లోపలి నుంచి ఈ ఘటన మొత్తాన్ని నర్వీందర్ సింగ్ చిత్రీకరించారు.
రోడ్డుపై జరిగిన చిన్న ఉదంతానికి కారు వద్దకు తన గర్ల్ ఫ్రెండ్‌తో వచ్చిన న్యూజిలాండ్ జాతీయుడు దూషణలకు దిగినట్లు నర్వీందర్ సింగ్ వీడియోలో తెలిపారు. ఫేస్‌బుక్ లైవ్‌లో వీడియోను చిత్రీకరిస్తున్నట్లు అతనితో చెప్పిన తర్వాత మరింత రెచ్చిపోయాడని చెప్పారు. న్యూజిలాండ్ విడిచి వెళ్లిపోవాలని బెదిరించినట్లు తెలిపారు. పంజాబీల గురించి కూడా దుర్భాషలాడినట్లు చెప్పారు. అతని మాటలు తనను కలవరానికి గురిచేసినట్లు తెలిపారు.
ఆవేశంతో అతను ఏదైనా ఆయుధంతో తనపై దాడి చేస్తాడేమోననే భయం కలిగిందని చెప్పారు. అక్కడి నుంచి వెళ్లిపోయి కారును పార్కు చేస్తుండగా సదరు వ్యక్తి మళ్లీ అక్కడికి వచ్చి తనను దుర్భాషలాడాడని తెలిపారు. గత వారం బిక్రమ్‌జిత్ సింగ్ అనే వ్యక్తికి కూడా ఇలాంటి పరిస్ధితి ఎదురైనట్లు చెప్పారు. వేగంగా వెళ్తున్న బిక్రమ్‌జిత్‌ను అడ్డగించిన ఓ న్యూజిలాండ్ పౌరుడు.. 'నీ దేశానికి వెళ్లిపో.. వేగం తగ్గించుకుని నడుపు!' అంటూ కామెంట్ చేశాడని తెలిపారు.