వర్ణవివక్షకు క్రికెట్ కూడా అతీతం కాదని మరోసారి నిరూపితమైంది. ఇంగ్లండ్‌లోని మిడిలెసెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్‌లో నల్లజాతీయులకు చోటు లేకుండా చేస్తున్నారంటూ హంప్‌షైర్ మాజీ క్రికెటర్ జాన్ హోల్డర్ పేర్కొన్నాడు. మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో హోల్డర్.. మిడిలెసెక్స్‌లో జరుగుతున్న దారుణాల గురించి వివరించాడు.
''మిడిలెసెక్స్ ఛైర్మన్ మైక్ ఓ ఫెరల్.. తన క్లబ్‌లో నల్లజాతీయుల క్రికెటర్లకు చోటు కల్పించడం లేదు. క్లబ్ మొత్తాన్ని తెల్లజాతీయ క్రికెటర్లతో నింపేద్దామనుకున్నాడు. అనుకున్నట్లుగానే ఆ క్లబ్‌లో ఇప్పుడు దాదాపు తెల్లజాతీయులే ఎక్కువగా ఉన్నారు. దీంతో ఛైర్మన్ మైక్ ఫెరల్ కామెంట్స్ నాకు కొత్తగా ఏం అనిపించలేదు. ఆ క్లబ్ తరపున ఆడుతున్న నా స్నేహితుడు.. సహచర క్రికెటర్ ఇది చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంత వివక్ష ఎందుకు.. నల్లజాతీయులు చేసిన పాపం ఏంటి..'' అంటూ హోల్డర్ అసహనం వ్యక్తం చేశాడు.
చదవండి: Rovman Powell: 10 సిక్సర్లతో విండీస్ బ్యాటర్ విధ్వంసం
మిడిలెసెక్స్ కౌంటీ ఛైర్మన్ మైక్ ఓ ఫెరల్; జాన్ హోల్డర్.. మాజీ హంప్‌షైర్ క్రికెటర్
''మిడిలెసెక్స్ ఛైర్మన్ మైక్ ఓ ఫెరల్ ఇచ్చిన స్టేట్‌మెంట్ పూర్తి చెత్తగా అనిపించింది. 15 ఏళ్ల వయసులో 1960లో నేను ఇంగ్లండ్‌లో అడుగుపెట్టినప్పుడు అచ్చం ఇలాంటి వివక్షనే ఎదుర్కొన్నా. ఫుట్‌బాల్‌లో రాణిద్దామని ఎన్నో ఆశలతో వచ్చా. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత వర్ణ వివక్షపై విపరీతమైన ప్రచారం ఉండేది. నల్లజాతీయులు ఆటలో పాల్గొంటే క్రీడాస్పూర్తి దెబ్బతింటుందని.. మ్యాచ్‌లు ఓడిపోయే అవకాశాలు ఎక్కువంటూ అనవసర ప్రచారాలు చేసేవారు.
చదవండి: పీటర్సన్ సునామీ ఇన్నింగ్స్.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లు.. కేవలం 38 బంతుల్లోనే
కానీ ఇంగ్లీష్ ఫుట్‌బాల్ ఇప్పుడు ఎలా ఉందో మీ అందరికి తెలిసిందే. కాలం మారడంతో పాటు ఫుట్‌బాల్‌ను కూడా పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు చూసుకుంటే ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్స్‌లో ఎక్కడా చూసినా నల్లజాతీయులే ఎక్కువగా కనిపిస్తున్నారు.''అని చెప్పుకొచ్చాడు. కాగా మైక్ ఓ ఫెరల్ చేసిన కామెంట్లపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో దెబ్బకు దిగివచ్చాడు. తాను చేసిన కామెంట్స్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంటూ.. నల్లజాతీయులను క్షమాపణ కోరడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment