
ఒక క్రీడాకారిణిగా, ముఖ్యంగా మనిషిగా ఇలాంటి వార్తలు వినాల్సి రావడం చాలా బాధ కలిగిస్తోంది.
జర్మన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడబోవడం లేదని ఆ జట్టు ఆటగాడు మెసట్ ఒజిల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. తనపై చూపెడుతున్న వివక్ష కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు. గెలిపించినప్పుడు మాత్రమే జర్మన్‌గా గుర్తించడం. జట్టు ఓటమి పాలైన సందర్భాల్లో ఒక వలసదారుడి వల్లే ఇదంతా జరిగిందంటూ నిందించడం సరికాదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఒజిల్ వ్యాఖ్యలకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మద్దతుగా నిలిచారు.
‘ఒక క్రీడాకారిణిగా, ముఖ్యంగా మనిషిగా ఇలాంటి వార్తలు వినాల్సి రావడం చాలా బాధ కలిగిస్తోంది. ఒజిల్ నువ్వు చెప్పింది ఒకటి నిజం. జాత్యహంకారం అసలు ఉండకూడదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. ఒకవేళ ఇదంతా నిజమైతే చాలా దురదృష్టకరమ‘ ని ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు. త్వరలో తల్లి కాబోతున్న సానియా ప్రస్తుతం ఆట నుంచి విరామం తీసుకుంటున్నారు.
This is the saddest thing to read as a an athlete , and more importantly as a human being .. you are right bout one thing @MesutOzil1088 racism should not and will not be accepted under any circumstance.. sad if all this is true .. https://t.co/d1MYyYoDYY
— Sania Mirza (@MirzaSania) July 23, 2018
చదవండి : గెలిచినపుడు మాత్రమే మీ వాడినా..!?
Comments
Please login to add a commentAdd a comment