
సానియాకు బాసటగా నిలిచిన మంచు లక్ష్మి
టెన్నిస్ తార సానియా మీర్జాకు ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మి మద్దతు ప్రకటించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన టెన్నిస్ తార సానియా మీర్జాకు ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మి మద్దతు ప్రకటించారు. సానియా జాతీయత, స్థానికతపై విమర్శలు చేయడాన్ని లక్ష్మి తప్పుపట్టారు.
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా సానియా మీర్జాను నియమించడం వివాదమైన నేపథ్యంలో లక్ష్మి సోషల్ మీడియాలో స్పందించారు. 'జరిగిందేదో జరిగిపోయింది. మన క్రీడాకారులను మనం అగౌరవ పరచరాదు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా సానియా మీర్జా తన పాత్రకు న్యాయం చేయగలరు. టెన్నిస్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడం ద్వారా సానియా తన జీవితాన్ని ఆటకు అంకితం చేశారు. తద్వారా భారత టెన్నిస్కు పేరు తీసుకువచ్చారు. సానియాపై చేస్తున్న విమర్శలకు ఇక ముగింపు పలకండి. సానియాకు నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నా' అంటూ లక్ష్మి పోస్ట్ చేశారు.