
లండన్ : 17 ఏళ్లుగా తనను ఉద్దేశించి ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజి స్టాఫ్ జాతి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని భారత సంతతి మహిళ ప్రియంవద గోపాల్(50) ఆరోపించారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఫెలోగా ఉన్న ప్రియంవద యూనివర్సిటీ తరఫున కింగ్స్ కాలేజిలో పని చేస్తున్నారు.
ఎప్పటినుంచో తనపై జాతి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నా వాటిని భరిస్తూ వస్తున్నానని, ఇక ఓపిక నశించిందని ప్రియంవద ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. అయితే, ప్రియంవద ఆరోపణలపై స్పందించిన కళాశాల యాజమాన్యం ప్రియంవదను ఉద్దేశించి స్టాఫ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment