వైవిధ్యమైన పాత్రలతో బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న నటడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఆయన ఇటీవల సుధీర్ మిశ్రా దర్శకత్వంలో చేసిన ‘సీరియస్ మెన్’లో తన నటనకు గానూ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు నామినేషన్ పొందాడు. ఈ తరుణంలో ఆయన బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్ర పరిశ్రమలో నెపోటిజం (బంధుప్రీతి) కంటే ఎక్కువగా రేసిజం (జాత్యాహంకారం) సమస్య ఉందని ఓ ఇంటర్వూలో తెలిపాడు.
నవాజ్ మాట్లాడుతూ.. ‘సీరియస్ మెన్’ తర్వాత మరో మంచి సినిమాలో లీడ్ రోల్ వస్తే అదే ఇందిరా తివారికి విక్టరీ అని చెప్పాడు. అంతేకాకుండా..‘ బాలీవుడ్‌లో తెల్లగా ఉండేవాళ్లతో పాటు నల్లగా ఉండేవారు కూడా హీరోయిన్లు చేయాలని కోరుకుంటున్నా. మంచి సినిమాలు రావాలంటే ఇదే కాకుండా పరిశ్రమలో ఉన్న పక్షపాతాలు అన్ని పోవాలి. నేను చాలా సంవత్సరాలుగా దానికి వ్యతిరేకంగా పోరాడాను. ఎందుకంటే నేను పొట్టిగా ఉంటాను. నా పరిస్థితి బానే ఉంది కానీ ఈ రకమైన భేషజాల వల్ల ఎంతో మంది గ్రేట్ యాక్టర్స్ బలైపోయారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే ఆయన నటించిన ‘సీరియస్ మెన్’లో లీడ్ రోల్‌లో నటించిన ఇందిరా తివారి పొట్టిగా, నల్లగా ఉంటుంది. ఈ తరుణంలో ఆయన బాలీవుడ్ గురించి చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment