పాన్ ఇండియా సినిమాలతో భాషా సరిహద్దులు చెదిరిపోయాయి. హీరోలను, ఇతర నటీనటులను అన్ని భాషల వారు అక్కున చేర్చుకుంటున్నారు. అలా సౌత్‌లో బాలీవుడ్ నటుల హవా కూడా పెరుగుతోంది. ఇటీవల వచ్చిన సైంధవ్ సినిమాతో హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు.
డబ్బులిస్తున్నారని నటిస్తున్నా
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను డబ్బు కోసం సినిమాల్లోకి రాలేదు. ఇష్టంతో ఈ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. రామన్ రాఘవ్ వంటి సినిమాలు చేసినప్పుడు ఆ పాత్రకు సంబంధించిన ఎమోషన్స్, ఆలోచనలపై నాకు పూర్తి పట్టు ఉంటుంది. కానీ దక్షిణాది చిత్రాల వరకు వచ్చేసరికి ఆ పట్టు అలాగే ఉంటుందని కచ్చితంగా చెప్పలేకపోతున్నాను. సౌత్‌లో నాకు మంచి పారితోషికం ఇస్తారు. వాళ్లు డబ్బు ఇవ్వగానే ఆయా పాత్రల్లో నటిస్తున్నాను.
పాత్రపై ఎమోషన్స్ ఉండట్లే
కానీ ఆ పాత్రలపై పట్టు కోల్పోతుండటంతో షూటింగ్‌కు ముందు ఎవరో ఒకరు.. నేనేం చేయాలి? ఏ డైలాగ్స్ చెప్పాలనేది నాకు వివరించాల్సి వస్తోంది. కొన్నిసార్లు అక్కడేం జరుగుతుందనేది అర్థం కావడం లేదు. ఏదో యాడ్ షూటింగ్ అన్నట్లుగా పని కానిచ్చేస్తున్నాను. డబ్బులిస్తున్నారు, నటిస్తున్నానంతే అన్నట్లుగా ఉంటున్నాను. కానీ ఆ పాత్రపై ఎటువంటి ఎమోషన్స్ పెంచుకోవట్లేదు. అందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా నవాజుద్దీన్ సిద్దిఖి ఇటీవల రౌతు కా రాజ్ అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment