Pak Vs Eng 2nd Test: Babar Azam Left Shell Shocked With Insane Delivery From Ollie Robinson - Sakshi
Sakshi News home page

ENG vs PAK: పాపం బాబర్‌ ఆజం.. ఇంగ్లండ్‌ బౌలర్‌ దెబ్బకు మైండ్‌ బ్లాంక్‌! వీడియో వైరల్‌

Published Tue, Dec 13 2022 12:03 PM | Last Updated on Tue, Dec 13 2022 3:27 PM

Babar Azam left shell shocked with insane delivery from Ollie Robinson - Sakshi

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 26 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కీలకమ్యాచ్‌లో పరాజయం పాలైన పాకిస్తాన్‌ 2-0 తేడాతో చారిత్రాత్మక టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఇక ఈ మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ బౌలర్‌ ఓలీ రాబిన్సన్‌ సంచలన బంతితో మెరిశాడు.

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను రాబిన్సన్‌ అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆఫ్‌ సైడ్‌ పడిన బంతి అద్భుతంగా టర్న్‌ అవుతూ స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో బాబర్‌ ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. ఇ​క కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ఆజం నిరాశతో మైదానాన్ని వీడాడు. 

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టెస్టు కరాచీ వేదికగా డిసెంబర్‌ 17 నుంచి ప్రారంభం కానుంది.
చదవండిENG vs PAK: ఇదేం బుద్ధి? స్టోక్స్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వని పాక్ క్రికెటర్! వీడియో వైరల్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement