England vs South Africa, 3rd Test: బ్రెండన్ మెకల్లమ్.. ఈ న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ ఇంగ్లండ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆ జట్టు ఇంతవరకు ఒక్క టెస్టు సిరీస్ కూడా ఓడిపోలేదు. కొత్త కెప్టెన్ బెన్‌స్టోక్స్ సారథ్యంలో మే నుంచి వరుస విజయాలు సాధిస్తోంది. బజ్‌బాల్ విధానంతో దూకుడైన ఆట కనబరుస్తూ స్వదేశంలో సంచలనాలు నమోదు చేసింది.
తాజాగా దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. లండన్ వేదికగా ముగిసిన ఆఖరి టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కోచ్ మెకల్లమ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
నాకసలు ఈ జాబ్ అవసరమే లేదు!
ఈ మేరకు స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడిన బ్రెండన్ మెకల్లమ్.. ‘‘నిజానికి నాకసలు ఇంగ్లండ్ కోచ్‌గా జాబ్ అవసరమే లేదు! అయితే.. ఆ పదవి నన్ను వరించింది. నాకిది నచ్చింది. ఇప్పుడు నా పనిని ప్రేమిస్తున్నాను. ఇంతకు ముందెన్నడూ నాకు ఇలాంటి అనుభవం లేదు.
ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఇక్కడ ప్రతిభకు కొదువ లేదు. ఆట పట్ల వారి అంకితభావాన్ని దగ్గరగా గమనిస్తున్నా. ముఖ్యంగా స్టోక్స్‌తో కలిసి పనిచేయడాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. తనొక అద్భుతమైన మనిషి. తనకెవ్వరూ సాటిరారు. తను గొప్ప నాయకుడు. కెప్టెన్‌గా సరైన వ్యక్తి’’ అని చెప్పుకొచ్చాడు.
కేకేఆర్‌ను వీడి.. ఇంగ్లండ్ కోచ్‌గా..
తాము ఇలాగే వరుస సిరీస్‌లు గెలుస్తూ అభిమానులకు ఆనందం పంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్‌లోని అసలైన మజాను ప్రేక్షకులకు అందిస్తామని తెలిపాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెకల్లమ్ కోచ్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే, ఇంగ్లండ్‌కు మార్గదర్శనం చేసే క్రమంలో అతడు కేకేఆర్‌కు దూరం కాగా.. 2023 సీజన్‌కు గానూ చంద్రకాంత్ పండిట్‌ను తమ హెడ్‌కోచ్‌గా నియమించుకుంది కోల్‌కతా ఫ్రాంఛైజీ.
చదవండి: T20 WC: నేనైతే వాళ్లిద్దరిని సెలక్ట్ చేసేవాడిని! నువ్వొక మాజీ కెప్టెన్.. కానీ ఏం లాభం?
క్రికెట్ సౌతాఫ్రికాకు భారీ షాక్
Comments
Please login to add a commentAdd a comment