క్లాసెన్‌ విధ్వంసకర శతకం.. ఇంగ్లండ్‌ టార్గెట్‌ 400 పరుగులు | Klaasen, Jansen help SA score 399-7 vs ENG | Sakshi
Sakshi News home page

SA vs ENG WC 2023: క్లాసెన్‌ విధ్వంసకర శతకం.. ఇంగ్లండ్‌ టార్గెట్‌ 400 పరుగులు

Published Sat, Oct 21 2023 6:10 PM | Last Updated on Sat, Oct 21 2023 6:22 PM

Klaasen, Jansen help SA score 399-7 vs ENG - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ​మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ప్రోటీస్‌ బ్యాటర్లు ఇంగ్లండ్‌ బౌలర్ల భరతం పట్టారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

ప్రోటీస్‌ బ్యాటర్లలో హెన్రిస్‌ క్లాసన్‌ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 67 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్‌ 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్(85), మార్కో జాన్సెన్(75) రాస్సీ వాన్ డెర్ డస్సెన్(60), పరుగులతో అదరగొట్టారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో టాప్లీ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్‌, గుస్ అట్కిన్సన్ రెండు వికెట్లు సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement