బుధవారం బ్రిస్టల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లతో అలీ హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన ఇంగ్లండ్ ఆటగాడిగా అలీ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్‌పై 17 బంతుల్లో అర్థసెంచరీ సాధించిన లియామ్ లివింగ్‌స్టోన్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ రికార్డును అలీ బద్దలు కొట్టాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో మూడో స్ధానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఉన్నాడు.
అతడు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాపై 21 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జానీ బెయిర్ ప్టో(90) పరుగులతో చేలరేగగా.. మొయిన్ అలీ(52) పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఇక 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ట్రిస్టన్ స్టాబ్స్( 28 బంతుల్లో 72 పరుగులు), రీజా హెండ్రిక్స్(57) పరుగులతో టాప్ స్కోరర్‌లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో రిచర్డ్ గ్లెసన్ 3, రీస్ టోప్లీ, ఆదిల్ రషీద్ రెండు వికెట్లు తీయగా.. మొయిన్ అలీ ఒక వికెట్ పడగొట్టాడు.
చదవండి: Shikhar Dhawan: ప్రపంచకప్ జట్టులో ధావన్ ఉండాలి! అవసరం లేదు!
Comments
Please login to add a commentAdd a comment