![Jonny Bairstow-Moeen Ali Stars England Beat South Africa By 41 Runs - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/28/Bairstow.jpg.webp?itok=Mqn0DBu1)
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. బుధవారం బ్రిస్టల్ వేదికగా జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. జానీ బెయిర్ స్టో 53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 90 పరుగులు విధ్వంసం సృష్టించగా.. మెయిన్ అలీ 18 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 52 పరుగులతో ప్రొటీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. అంతకముందు డేవిడ్ మలాన్ కూడా 23 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేయగలిగింది. ట్రిస్టన్ స్టబ్స్ 28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 72 పరుగులు, రీజా హెండ్రిక్స్ 33 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 57 పరుగులు చేసినప్పటికి మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో రిచర్డ్ గ్లెసన్ 3, రీస్ టోప్లీ, ఆదిల్ రషీద్ రెండు వికెట్లు తీయగా.. మొయిన్ అలీ ఒక వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ.. బౌలింగ్‌లో ఒక వికెట్ తీసిన మొయిన్ అలీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇరుజట్ల మధ్య రెండో టి20 గురువారం(జూలై 28న) జరగనుంది.
చదవండి: రోహిత్ శర్మ రికార్డు బద్దలు.. కివీస్ తరపున తొలి ఆటగాడిగా
Comments
Please login to add a commentAdd a comment