తెంబా బవుమా (ఫైల్ ఫొటో)
ICC ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్ నేపథ్యంలో సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బ తగిలింది. అనారోగ్యం కారణంగా కెప్టెన్ తెంబా బవుమా జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఎయిడెన్ మార్కరమ్ సౌతాఫ్రికా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు.
కాగా పటిష్ట ప్రొటిస్ జట్టు గత మ్యాచ్‌లో అనూహ్య రీతిలో నెదర్లాండ్స్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ధర్మశాలలో అక్టోబరు 17 వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.
ఈ క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో శనివారం నాటి మ్యాచ్‌కు ముందు తెంబా బవుమా జట్టుకు దూరమయ్యాడు. రీజా హెండ్రిక్స్ అతడి స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా నెదర్లాండ్స్ చేతిలో ఓటమి తప్ప కెప్టెన్‌గా బవుమా మిగతా మ్యాచ్‌లలో విజయవంతమయ్యాడు.
అయితే, బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. శ్రీలంక, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్లతో మ్యాచ్‌లలో వరుసగా 8, 35, 11 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ క్రమంలో అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమైన వన్‌డౌన్ బ్యాటర్ బవుమా స్థానంలో వచ్చిన హెండ్రిక్స్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి! ఇక ఇంగ్లండ్‌తో ముంబై మ్యాచ్‌లో టాస్ ఓడిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌కు దిగింది.
చదవండి: ఇలాంటి బ్యాటర్‌ను చూడలేదు.. మొన్నటి దాకా మావాళ్లు తోపులు అన్నారు.. ఇప్పుడు: రమీజ్ రాజా
Comments
Please login to add a commentAdd a comment