ఇంగ్లండ్‌-సౌతాఫ్రికా సూపర్‌-8 పోరు.. తుది జట్లు ఇవే | T20 World Cup 2024, England Vs South Africa Live Score: England Opt To Bowl First Against South Africa | Sakshi
Sakshi News home page

T20 WC 2024: ఇంగ్లండ్‌-సౌతాఫ్రికా సూపర్‌-8 పోరు.. తుది జట్లు ఇవే

Published Fri, Jun 21 2024 7:57 PM | Last Updated on Fri, Jun 21 2024 8:21 PM

ENG vs SA: England opt to bowl first against South Africa

టీ20 వరల్డ్‌ కప్‌-2024లో కీలక సమరానికి సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీ సూపర్‌-8లో భాగంగా సెయింట్‌ లూసియా వేదికగా ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. సౌతాఫ్రికా మాత్రం తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది.

స్పిన్నర్‌ షంమ్సీ స్ధానంలో ఒట్నీల్ బార్ట్‌మాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఇరు జట్లు ఇప్పటికే సూపర్‌-8 రౌండ్‌లో చెరో విజయం సాధించాయి. 

తుది జట్లు

దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్‌ కీపర్‌), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్ట్జే, ఒట్నీల్ బార్ట్‌మన్

ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కెప్టెన్‌/ వికెట్‌ కీపర్‌), హ్యారీ బ్రూక్, జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టోప్లీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement