మార్కరమ్- బవుమా (PC: CSA)
Temba Bavuma to travel back home: సౌతాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్ తెంబా బవుమా స్వదేశానికి తిరిగి పయనం కానున్నాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తమ ఇంటికి వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లకు బవుమా దూరం కానున్నాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ ధ్రువీకరించింది.
కాగా అక్టోబరు 5 నుంచి ఆరంభం కానున్న వన్డే వరల్డ్‌కప్-2023 కోసం ఇప్పటికే ప్రొటిస్ జట్టు భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. కేరళలో వార్మప్ మ్యాచ్‌లు ఆడే క్రమంలో సోమవారం త్రివేండ్రంలో అడుగుపెట్టింది. అక్కడే అఫ్గనిస్తాన్‌తో సెప్టెంబరు 29న, న్యూజిలాండ్‌తో అక్టోబరు 2న తలపడనుంది.
ఆ రెండు మ్యాచ్‌లకు బవుమా దూరం: సౌతాఫ్రికా క్రికెట్
అయితే, జట్టుతో పాటే భారత్‌కు విచ్చేసిన తెంబా బవుమా వ్యక్తిగత కారణాల దృష్ట్యా తిరిగి సౌతాఫ్రికాకు వెళ్లనున్నాడు. ఈ మేరకు.. ‘‘ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2023లో అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్‌లతో సెప్టెంబరు 29, అక్టోబరు 2న జరుగనున్న వార్మప్ మ్యాచ్‌లకు బవుమా దూరం కానున్నాడు.
అతడి గైర్హాజరీలో ఎయిడెన్ మార్కరమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు’’ అని క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటన విడుదల చేసింది. కాగా గురువారమే బవుమా తిరిగి వెళ్లిపోనున్నట్లు సమాచారం. అతడి స్థానంలో టీ20 కెప్టెన్ మార్కరమ్ వార్మప్ మ్యాచ్‌లలో వన్డే జట్టుకు సారథ్యం వహించనున్నాడు.
సూపర్‌ఫామ్‌లో బవుమా
ప్రొటిస్ కెప్టెన్ తెంబా బవుమా వన్డే ఫార్మాట్‌లో ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 104.08 స్ట్రైక్‌రేటుతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గత తొమ్మిది వన్డే ఇన్నింగ్స్‌లో ఏకంగా మూడు సెంచరీలు సాధించాడు. మరో మ్యాచ్‌లో కేవలం పది పరుగుల తేడాతో శతకం చేజార్చుకున్నాడు.
చదవండి: 'ఈ డర్టీ గేమ్‌లో నాకు ఆడాలని లేదు.. కావాలనే నన్ను తప్పించారు'
హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యా: బాబర్ భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment