
ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. ఈ జట్టుకు టెంబా బావుమా సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా ఆల్‌రౌండర్లు మార్కో జాన్‌సెన్, సిసంద మగలకు వన్డే జట్టులో చోటు దక్కింది. ఇక గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న ప్రోటీస్ స్టార్ బ్యాటర్ వాన్ డెర్ డస్సెన్ ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు.
ఇక ఈ సిరీస్‌కు ఎంపికైన ప్రోటీస్ సీనియర్ ఆటగాళ్లు క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, జన్నెమాన్ మలన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్ ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా ఉన్నారు. అయితే సిరీస్ సమయానికి వీరంతా జట్టుతో కలవనున్నారు. ఇక జనవరి 27న బ్లోమ్‌ఫోంటెయిన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ఆరంభం కానుంది. కాగా భారత్ వేదికగా ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్ ప్రోటీస్‌కు చాలా కీలకం.
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ప్రోటీస్ జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగలా, కేశవ్ మహరాజ్, జన్నెమాన్ మలన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్జే, వేన్ పార్నెల్, షమ్సీ, వాన్ డెర్ డస్సెన్
చదవండి: IND vs NZ: నేను అనుకున్నది జరగలేదు.. అతడు మాత్రం భయపెట్టాడు: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment