
బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో ప్రొటీస్ సొంతం చేసుకుంది. 343 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ప్రోటీస్ విజయంలో ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా కీలక పాత్ర పోషించాడు.
102 బంతులు ఎదుర్కొన్న బావుమా 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 109 పరుగులు చేశాడు. అదే విధంగా డెవిడ్ మిల్లర్ కూడా 58 పరుగులతో ఆజేయం నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ స్టోన్, రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కుర్రాన్ ఒక్క వికెట్ సాధించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 342 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(80), జోస్ బట్లర్(94 నాటౌట్), మొయిన్ అలీ(51) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ప్రోటిస్ బౌలర్లలో నోర్జే రెండు వికెట్లు సాధించగా.. పార్నెల్, ఎంగిడీ, మార్‌క్రమ్, జానెసన్ తలా వికెట్ పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే కింబర్లీ వేదికగా ఫిబ్రవరి 1న జరగనుంది.
చదవండి: Gongadi Trisha: శెభాష్ బిడ్డా! మ్యాచ్‌ను మలుపు తిప్పిన త్రిష.. భద్రాచలంలో సంబరాలు
Comments
Please login to add a commentAdd a comment