ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఇంగ్లండ్ సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ప్రొటిస్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా సూపర్ సెంచరీతో జట్టుకు విజయం అందించి సిరీస్‌ను గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ విషయం పక్కనబెడితే.. సౌతాఫ్రికా బ్యాటర్ వాండర్ డసెన్‌ను బట్లర్ తన వెకిలి చేష్టలతో చిరాకు తెప్పించాడు దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో బట్లర్.. ''నీ సమస్యేంటి రాసీ.. ప్రతీసారి నీ గురించి రావడం లేదు.. బంతిని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నా.. నిన్ను కాదు'' అంటూ పేర్కొన్నాడు. దానికి డసెన్.. ''ఏం జరిగిందో నేను చూశాను'' అంటూ ధీటుగా బదులిచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు వాగ్వాదానికి దిగడం స్టంప్‌మైక్‌లో రికార్డయింది. ఇదంతా గమనించిన అంపైర్ ఇక చాలు ఆపండి అనగానే ఇద్దరు సైలెంట్ అయిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే ఇలాంటివి బట్లర్‌కు కొత్తేమి కాదు. ఇంతకముందు కూడా తన కవ్వింపు చర్యలతో బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టాడు. 2020లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో క్రీజులో ఉన్న ఫిలాండర్‌తో బట్లర్ మాటల యుద్ధానికి దిగాడు. ఫీల్డర్ బంతిని అందుకొని ఫిలాండర్ వైపు విసిరాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న బట్లర్.. ఫిలాండర్‌ను చూస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో ఈ వీడియో బాగా పాపులర్ అయింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. జాస్ బట్లర్ 94 నాటౌట్, హ్యారీ బ్రూక్ 80, మొయిన్ అలీ 51 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రాకా 49.1 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. టెంబా బవుమా 109 పరుగులు చేయగా.. డేవిడ్ మిల్లర్ 58 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
👀 Jos Buttler is at it again.#SAvsENG | #Proteas https://t.co/d4724m1ws7 pic.twitter.com/TSn9OdaK3M
— PEAK (@ThePeakSA) January 29, 2023
Comments
Please login to add a commentAdd a comment