ఇంగ్లండ్ గడ్డపై రెండు నెలల పాటు సాగే సుదీర్ఘ పర్యటనలో భాగంగా సౌతాఫ్రికా ఇవాళ (జులై 14) ఇంగ్లండ్ లయన్స్‌ను రెండో వార్మప్ మ్యాచ్‌లో ఢీకొంది. తొలి మ్యాచ్‌లో లయన్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైన ప్రొటీస్.. ఈ మ్యాచ్‌లో కోలుకున్నట్లు కనిపించింది. ఈ 50 ఓవర్స్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 360 పరుగుల భారీ స్కోర్ చేసింది. వికెట్‌కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ సుడిగాలి శతకంతో (85 బంతుల్లో 123; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడగా.. వాన్ డెర్ డస్సెన్ (61), ఫెలుక్వాయో (67) అర్ధసెంచరీలతో రాణించారు.
ఇదిలా ఉంటే, జులై 19న ఇంగ్లండ్‌తో జరిగే తొలి వన్డేతో దక్షిణాఫ్రికా సిరీస్ మొదలవుతుంది. జులై 22, 24 తేదీల్లో రెండు, మూడు వన్డేలు, ఆతర్వాత 27, 28, 31 తేదీల్లో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్.. ఆగస్ట్ 17-సెప్టెంబర్ 12 వరకు 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగనుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లతో బరిలోకి దిగనుండటం విశేషం. టెస్ట్‌లకు డీన్ ఎల్గర్, వన్డేలకు కేశవ్ మహారాజ్, టీ20లకు డేవిడ్ మిల్లర్‌లు సౌతాఫ్రికా కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.
చదవండి: డోపింగ్‌కు పాల్పడ్డ బంగ్లాదేశ్ పేసర్‌పై వేటు
Comments
Please login to add a commentAdd a comment