పార్ల్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో సౌతాఫ్రికా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (97 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 86 పరుగులు) రాణించడంతో సౌతాఫ్రికా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ డి జోర్జి (33), ర్యాన్ రికెల్టన్ (36), ఎయిడెన్ మార్క్రమ్ (35), మార్కో జన్సెన్ (10), కగిసో రబాడ (11), ఓట్నీల్ బార్ట్‌మన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. రస్సీ వాన్ డెర్ డస్సెన్ (8), ట్రిస్టన్ స్టబ్స్ (1), అండైల్ ఫెహ్లుక్వాయో (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
ఓపెనర్లు జోర్జి, రికెల్టన్ తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించడంతో సౌతాఫ్రికా ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే ఇక్కడే పాక్ స్పిన్నర్ సల్మాన్ అఘా సఫారీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అఘా 18 పరుగుల వ్యవధిలో జోర్జి, రికెల్టన్, డస్సెన్, స్టబ్స్ వికెట్లు పడగొట్టాడు.
ఈ దశలో మార్క్రమ్.. కొద్దిసేపు క్లాసెన్‌తో కలిసి క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు. మార్క్రమ్ ఔటయ్యాక జన్సెన్ సాయంతో క్లాసెన్ సెంచరీ దిశగా సాగాడు. అయితే సఫారీలను ఈ సారి షాహీన్ అఫ్రిది ఇబ్బందుల్లోకి నెట్టాడు. సెంచరీకి చేరువలో ఉండగా అఫ్రిది క్లాసెన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు.
ఆఖర్లో టెయిలెండర్లు ఒక్కో పరుగు పోగు చేయడంతో సౌతాఫ్రికా 239 పరుగులు చేయగలిగింది. పాక్ బౌలర్లలో సల్మాన్ అఘా 4, అబ్రార్ అహ్మద్ 2, షాహీన్ అఫ్రిది, సైమ్ అయూబ్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment