పాకిస్తాన్‌తో సిరీస్‌.. సౌతాఫ్రికా కెప్టెన్‌గా విధ్వంసకర వీరుడు | Heinrich Klaasen To Lead South Africa In Pakistan T20Is | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌తో సిరీస్‌.. సౌతాఫ్రికా కెప్టెన్‌గా విధ్వంసకర వీరుడు

Dec 4 2024 2:29 PM | Updated on Dec 4 2024 3:05 PM

Heinrich Klaasen To Lead South Africa In Pakistan T20Is

స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం సౌతాఫ్రికా జట్టును ఇవాళ (డిసెంబర్‌ 4) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా విధ్వంసకర వీరుడు, వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ ఎంపికయ్యాడు. శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌ కమిట్‌మెంట్స్‌ కారణంగా రెగ్యులర్‌ కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. శ్రీలంకతో రెండో టెస్ట్‌ ముగిసిన మరుసటి రోజే టీ20 సిరీస్‌ మొదలుకానుండటంతో మార్క్రమ్‌ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సిరీస్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది. 

మార్క్రమ్‌తో పాటు లంకతో టెస్ట్‌ సిరీస్‌లో సభ్యులైన మార్కో జన్సెన్‌, కేశవ్‌ మహారాజ్‌, కగిసో రబాడ, ట్రిస్టన్‌ స్టబ్స్‌ కూడా పాక్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నారు. లంకతో టెస్ట్‌ సిరీస్‌లో సభ్యులైన ర్యాన్‌ రికెల్టన్‌, క్వేనా మపాకా, మాథ్యూ బ్రీట్జ్కీ మాత్రం పాక్‌తో టీ20లకు ఎంపికయ్యారు.

మరోవైపు, టీ20 వరల్డ్‌కప్‌ అనంతరం జట్టుకు దూరంగా ఉన్న అన్రిచ్‌ నోర్జే, తబ్రేజ్‌ షంషి పాక్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యారు. మూడేళ్లకు పైగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న జార్జ్‌ లిండే కూడా పాక్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. 

కాగా, పాకిస్తాన్‌ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌లలో తొలుత టీ20లు జరుగనున్నాయి. డిసెంబర్‌ 10, 13, 14 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం డిసెంబర్‌ 17, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. డిసెంబర్‌ 26-30 వరకు తొలి టెస్ట్‌.. జనవరి 3-7 వరకు రెండో టెస్ట్‌ జరుగనున్నాయి. ఈ మూడు సిరీస్‌ల కోసం పాకిస్తాన్‌ జట్టును ఇవాళే ప్రకటించారు. 

పాక్‌తో టీ20 సిరీస్‌ కోసం సౌతాఫ్రికా జట్టు..
హెన్రిచ్ క్లాసెన్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, పాట్రిక్ క్రుగర్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నార్జే, న్కాబా పీటర్, ర్యాన్‌ రికెల్టన్‌, తబ్రేజ్‌ షంషి, అండైల్‌ సైమ్‌లేన్‌, రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement