ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తాను ఫామ్‌లోకి వస్తే ఎలా ఉంటుందో సౌతాఫ్రికా జట్టుకు రుచి చూపించాడు. గాయంతో ఆటకు దూరమైన ఆర్చర్ దాదాపు రెండేళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే తొలి వన్డేలో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆర్చర్ 81 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. అతని కెరీర్‌లో కూడా ఇవే అత్యంత చెత్త గణాంకాలు. రీఎంట్రీలో చెత్త ప్రదర్శనపై విమర్శలు రావడంతో కెప్టెన్ బట్లర్ ఆర్చర్‌ను తర్వాతి మ్యాచ్‌కు పక్కనబెట్టాల్సి వచ్చింది.
అయితే ఆర్చర్ ఆ మాత్రానికే కుంగిపోలేదు. రెండేళ్ల పాటు ఆటకు దూరంగా ఉన్న అతను ఇలాంటి ఇబ్బందులను చాలానే ఎదుర్కొన్నాడు. ఇంతలో ఇంగ్లండ్ వరుసగా రెండో వన్డేలోనూ ఓటమిపాలై సిరీస్‌ను సౌతాఫ్రికాకు కోల్పోయింది. కనీసం మూడో వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ఇంగ్లండ్ భావించింది. దీంతో జోఫ్రా ఆర్చర్‌ను మళ్లీ తుది జట్టులోకి తీసుకున్నాడు బట్లర్. ఆర్చర్‌పై ఉన్న నమ్మకంతోనే అతన్ని తుది టీంలోకి ఎంపిక చేశామని టాస్ సమయంలో బట్లర్ పేర్కొన్నాడు.
బట్లర్ మాటలను ఆర్చర్ నిజం చేసి చూపించాడు. రెండేళ్ల పాటు ఆటకు దూరమైన ఆర్చర్ రెండు మ్యాచ్‌ల వ్యవధిలోనే తన పేస్ పదునును తిరిగి అందుకున్నాడు. 9.1 ఓవర్లలో 40 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లతో సౌతాఫ్రికాను శాసించాడు. ఆర్చర్ వన్డే కెరీర్‌లో ఇదే బెస్ట్ స్పెల్‌గా నిలిచిపోనుంది. తొలి వన్డేలో ధారాళంగా పరుగులిచ్చుకొని తిట్టించుకున్న ఆర్చర్.. వారి నోటితోనే మళ్లీ మెచ్చుకునేలా చేశాడు.
ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రానా తనను తక్కువ చేసి చూడొద్దని పరోక్షంగా హెచ్చరించాడు. ఇక కీలకమైన వన్డే వరల్డ్‌కప్‌కు ముందు ఆర్చర్ ఫామ్‌లోకి రావడం ఇంగ్లండ్‌కు సానుకూలమని చెప్పొచ్చు. ఒక్కసారి అతను ఫామ్‌లోకి వచ్చాడంటే ఆపడం ఎవరి తరం కాదు. అందుకే మ్యాచ్‌లో బట్లర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచినప్పటికి తన అవార్డును ఆర్చర్‌కు ఇచ్చి అతనిపై ఉన్న గౌరవాన్ని పరోక్షంగా చాటుకున్నాడు.
చదవండి: శతకాలతో చెలరేగిన బట్లర్, మలాన్.. ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం
'ఆ విషయాలు పెద్దగా పట్టించుకోను.. భవిష్యత్తుకు డోకా లేనట్లే'
Comments
Please login to add a commentAdd a comment